Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్ కారణంగా మరో జంట బ్రేకప్‌!?

By:  Tupaki Desk   |   14 Feb 2022 9:37 AM GMT
బిగ్‌ బాస్ కారణంగా మరో జంట బ్రేకప్‌!?
X
ఈమద్య కాలంలో సెలబ్రెటీల లవ్ బ్రేకప్ లు.. పెళ్లి విడాకులు సహజం అయ్యాయి. కొన్ని నెలల క్రితం బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావుకు విడాకులు ఇస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమయంలోనే సౌత్‌ లో బ్యాక్ టు బ్యాక్ విడాకుల వార్తలు వినాల్సి వచ్చింది. కొన్ని బాధను కలిగిస్తే కొన్ని లైట్‌ అనిపించాయి.

బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు కూడా విడాకుల కోసం ఎదురు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో మరో విడాకుల ప్రకటన రావడం ఒకింత ఆవేదన కలిగించే విషయం. ఇప్పటికే వరుస విడాకుల వార్తలు వినాల్సి వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ ప్రేమికులు ప్రేక్షకులు బాధపడుతూ ఉంటే వాలెంటైన్స్ డే కు కొన్ని గంటల ముందు తన భర్తకు విడాకులు ఇస్తున్నట్లుగా ప్రకటించి హాట్‌ బ్యూటీ రాకీ సావంత్‌ ఆశ్చర్యపర్చింది.

సినిమాలతో కంటే వివాదాల కారణంగా ఎక్కువ పాపులారిటీని దక్కించుకున్న రాకీ సావంత్ బిగ్ బాస్ తర్వాత తమ మద్య విభేదాలు పెరిగాయి అంటూ చెప్పుకొచ్చింది. రాకీ సావంత్ స్వయంగా విడాకుల విషయాన్ని ఇన్‌ స్టా గ్రామ్‌ ద్వారా తెలియజేసింది. తన భర్త రితేష్‌ తో విభేదాల గురించి ఎక్కువగా ప్రస్తావించని రాకీ సావంత్ అందరి సంతోషం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పడం ఒకింత ఆశ్చర్యంగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

రాకీ సావంత్ తన పోస్ట్‌ లో.. ప్రియమైన అభిమానులకు మరియు శ్రేయోభిలాషులకు నేను మరియు రితేష్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం అని తెలియజేయాలనుకుంటున్నాను. బిగ్ బాస్ తర్వాత చాలా విషయాలు జరిగాయి. ఆ విషయాలు నా కంట్రోల్‌ ను దాటి పోయాయి. మేము విభేదాలను తొలగించుకునే ప్రయత్నం చేశాం. కాని అవి సర్దుకునేలా లేవు అందుకే విడి పోవడం అన్ని విధాలుగా ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చాం.

నేను నిజంగా చాలా బాధతో ఉన్నాను. నా గుండెలు బరువెక్కాయి. వాలెంటైన్స్ డే కు ముందు ఇలాంటి ఒక పరిస్థితి రావడం బాధగా ఉంది. రితేష్ తన భవిష్యత్‌ జీవితం అంతా సాఫీగా సాగాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఆయన అనుకున్నవి సాధించాలని ఆశిస్తున్నాను. నేను కూడా ఇక మీదట సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాను అని నమ్ముతున్నాను. మీ అందరికి కూడా నన్ను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ పేర్కొంది.

ఇటీవలే తెలుగు బిగ్ బాస్ వల్ల ప్రేమ జంట విడిపోయింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో రాకీ సావంత్ బిగ్ బాస్ తర్వాత జరిగిన పరిణామాల వల్ల తాము విడిపోతున్నట్లుగా స్వయంగా ప్రకటించడం కాస్త ఆలోచింపజేసే విధంగా ఉంది. బిగ్ బాస్ వల్ల కాపురాలు కూలుతాయి అంటూ కొందరు ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి కాపురాలు కూలలేదు.. కాని ఈ రెండు సంఘటనలు బిగ్‌ బాస్ విషయంలో ఆలోచించేలా చేస్తున్నాయి.