Begin typing your search above and press return to search.
నాగచైతన్య - సమంత లానే మరో జంట స్ట్రగుల్?
By: Tupaki Desk | 18 May 2022 3:30 PM GMTఅక్కినేని నాగచైతన్య- సమంత జంట బ్రేకప్ వార్తలు ఇంతకుముందు సంచలనమైన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల సంసార జీవనంలో ఎంతో అన్యోన్యతను కనబరిచిన ఈ జంట ఆకస్మికంగా విడిపోవడం అభిమానులకు ఇప్పటికీ డైజెస్ట్ కాలేదు. ఇకపోతే సమంతతో చైతూ కలతలు కొనసాగుతున్న క్రమంలో కింగ్ నాగార్జున ఆ ఇద్దరినీ కలిపేందుకు ఎంతో ప్రయత్నించారు. అదే సమయంలో నాగచైతన్య నటించిన 'లవ్ స్టోరి' సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కు హైదాబాద్ విచ్చేసిన అమీర్ ఖాన్ చైతూ స్వభావం గురించి ప్రస్థావిస్తూ తనకు మద్ధతుగా నిలిచారు. అలాంటి కొడుకును కన్న ఆ తండ్రి ఎంతో గొప్పవారని కూడా కితాబిచ్చారు.
అయితే కిరణ్ రావు నుంచి విడిపోతున్నట్టు ప్రకటించి అమీర్ ఖాన్ కూడా షాకిచ్చారు. దానిని కూడా అభిమానులు డైజెస్ట్ చేసుకోలేదు. ఇక ఇప్పుడు మరో జంట నడుమ కలతల గురించి ప్రముఖంగా చర్చ సాగుతోంది. నిజానికి ఇది ఇప్పుడే తెలిసిన వ్యవహారం కాకపోయినా అమీర్ ఖాన్ కుటుంబ వ్యవహారం కాబట్టి దీనిపై అభిమానుల్లో గుసగుస వినిపిస్తోంది.
అమీర్ ఖాన్ ఎంతగానో అభిమానించే ఇమ్రాన్ ఖాన్ కాపురంలో కలతలు ఉన్నాయని రెండేళ్లుగా ఇవి సద్ధుమణగడం లేదనేది తాజా సమాచారం. ఇమ్రాన్- అవంతిక మధ్య సయోధ్య లేదు. ఇమ్రాన్ ఖాన్ .. అతని భార్య అవంతిక మాలిక్ విడిపోయినట్లు గత రెండేళ్లుగా వార్తలు వచ్చాయి.
కానీ వారు ఇంకా ఆ విషయాన్ని ధృవీకరించలేదు. వీరిద్దరూ రెండేళ్లుగా విడివిడిగా జీవిస్తున్నారు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ స్నేహితులు కుటుంబాలు కలిపేందుకు ప్రయత్నించినా కానీ ఇమ్రాన్ తన వైవాహిక జీవితాన్ని అవంతికతో పునఃప్రారంభించకూడదని నిర్ణయించుకున్నాడు.
కనీసం అవంతికతోనే కాదు ఇంకెవరితోనూ?! అన్నది మరో సస్పెన్స్. ఇమ్రాన్ తన భార్య అవంతిక వద్దకు తిరిగి వెళ్లాలని కోరుకోవడం లేదు. చివరకు ఎలాంటి ప్రయత్నమూ తమను తిరిగి కలపడం సాధ్యం కాదని ఆమె కూడా అర్థం చేసుకుంది. తమ పెళ్లికి మరో అవకాశం ఇవ్వాలని అవంతిక ముందే ఆలోచించుకున్నారనేది పనిలో పనిగా మరో గుసగుస.
కాబట్టి ఇమ్రాన్ - అవంతికల వివాహం ఇప్పుడు ముగిసిన అధ్యాయం అన్న చర్చా బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే ఇలాంటి వాటిని అధికారికంగా కుటుంబాల నుంచి ధృవీకరించాల్సి ఉంటుంది. అప్పటివరకూ ఇది బాలీవుడ్ మీడియా కథనాల సారం మాత్రమే.. కేవలం అనధికారికం మాత్రమే. మరోవైపు వ్యక్తిగత జీవితంలో కలతల కారణంగా ఇమ్రాన్ ఖాన్ కెరీర్ కూడా ఇటీవలి కాలంలో డైలమాలో పడిన సంగతి తెలిసిందే. చైతన్య- సమంత జంట బ్రేకప్.. అమీర్ ఖాన్- కిరణ్ రావు బ్రేకప్.. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ - అవంతిక జంట బ్రేకప్ గురించిన వార్తలు అభిమానులను తీవ్రంగా కలతకు గురి చేస్తున్నాయి.