Begin typing your search above and press return to search.
ఫిబ్రవరిలో మరో క్రేజీ మూవీ సాహసం
By: Tupaki Desk | 31 Jan 2022 6:47 AM GMTకరోనా థర్డ్ వేవ్ ప్రభావం జనవరి.. ఫిబ్రవరి మరియు మార్చి మూడు నెలల పాటు ఉంటుందని అంతా అనుకున్నారు. ఈ మూడు నెలల పాటు సినిమాల విడుదల ఉండక పోవచ్చు అనుకున్నారు. జనవరి లో పెద్ద సినిమాలు సాహసం చేయలేక పోయాయి కాని బంగార్రాజు తో పాటు మరికొన్ని సినిమాలు సాహసం చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కంటెంట్ బాగుంటే కలెక్షన్స్ వచ్చాయి. ఫిబ్రవరి నెలలో మరీ పీక్స్ లో కేసులు పెరుగుతాయి కనుక మొత్తం లాక్ డౌన్ ఉండే అవకాశం ఉందని అంతా భావించారు. కాని కేసులు ఉత్తర భారతంలో ఇప్పటికే తగ్గాయి.. దక్షిణ భారతంలో అసలు పీక్స్ కు చేరనే లేదు.
దాంతో ఫిబ్రవరి నెలలో పరిస్థితులు నార్మల్ గా ఉండే అవకాశం ఉందని ఇప్పుడు అనుకుంటున్నారు. అయినా కూడా కొందరు తమ సినిమాలను ఫిబ్రవరి లో విడుదల చేయడానికి వెనకాడుతున్నారు. కాని కొందరు మాత్రం ఆ తర్వాత తమకు అవకాశం ఉండదనే ఉద్దేశ్యంతో ఫిబ్రవరిలోనే విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.
ఫిబ్రవరి నెలలో ఏపీ లో పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ లో పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ తో థియేటర్లు రన్ అవుతున్నాయి. కనుక ఫిబ్రవరి నెలలో తమ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు బన్నీ వాసు సిద్దం అయ్యాడు. అల్లు అరవింద్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన 18 పేజెస్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.
నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. కరోనా కారణంగా ఇన్నాళ్లు ఆలస్యం అయిన ఈ సినిమా ను మరింత ఆలస్యం చేయలేమంటూ ఫిబ్రవరి మూడవ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది.
విభిన్నమైన ప్రేమ కథ చిత్రంగా ఈ సినిమాను సూర్య ప్రతాప్ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ లో రూపొందిన సినిమా అవ్వడంతో పాటు సుకుమార్ ఈ సినిమా కు రచన సహకారం అందించడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు గ్లిమ్స్ సినిమా పై అంచనాలు పెంచేస్తున్నాయి.
అనుపమ పరమేశ్వరన్ మరియు నిఖిల్ ల కాంబో కెమిస్ట్రీ ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజికల్ సక్సెస్ ను దక్కించుకుంటుందనే నమ్మకం కూడా వ్యక్తం అవుతుంది.
ఈ సినిమా ఫిబ్రవరి లో కాకుండా మార్చి లేదా ఏప్రిల్ లో విడుదలకు వీలు పడదు. ఎందుకంటే మార్చి నుండి వరుసగా మూడు నాలుగు నెలల పాటు పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. కనుక ఫిబ్రవరిలోనే ఈ సినిమా ను విడుదల చేసి సాహసం చేయాల్సిందే అని మేకర్స్ భావిస్తున్నారట. కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అవుతాయని విశ్లేషకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
కనుక సినిమా పై వారికి నమ్మకం ఉండటం వల్లే విడుదలకు సాహసం చేస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ సాహసం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది చూడాలి.