Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ 

By:  Tupaki Desk   |   20 Jan 2023 5:30 PM GMT
టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ 
X
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిలు కలిసి నటించిన చిత్రం భీమ్లా నాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఏ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుందో కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైనర్ సంస్థ తెరకెక్కించింది. ఇప్పుడు ఇదే సంస్థ నుంచి మరో మల్టీ స్టారర్ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. నీది నాదే ఒకే కథ, విరాట పర్వం సినిమాలతో తన డైరెక్షన్ టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న వేణు ఉడుగుల.. ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

దర్శకుడు వేణు ఉడుగులతో.. సితార ఎంటర్ టైన్ మెంట్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు ఉంటారని.. 50 ఏళ్ల వయసు ఉన్న ఓ వ్యక్తికీ, పాతికేళ్ల కుర్రాడికి మధ్య నడిచే కథ అని సమాచారం. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద హీరోలను ఈ సినిమాలో హీరోలుగా తీసుకోవాలని సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ప్రయత్నిస్తోందట. కానీ చాలా వరకు తెలుగు హీరోలు బిజీగా ఉన్నారని.. ఇక్కడ కుదరకపోతే.. తమిళ్ నుంచి ఓ హీరోని, తెలుగు నుంచి మరో హీరోని తీసుకుంటారట.

ఈ కథ పెద్ద పెద్ద హీరోల్ని డిమాండ్ చేసే రేంజ్ లో ఉందట. కానీ స్టార్ హీరోల కాల్షీట్లు దొరకడమే కష్టంగా మారుతుందట. అందుకే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదని.. హీరోలు దొరికిన వెంటనే.. సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు చెబుతున్నారు. అయితే వచ్చే నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లో హీరోలను తీసుకొని షూటింగ్ మొదలు పెడతారట. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు రెడీగా ఉన్నప్పటికీ.. హీరోలు దొరకడంలోనే కాస్త ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మైత్రీ మూవీస్ నుంచి కూడా డైరెక్టర్ వేణు ఉడుగుల అడ్వాన్స్ తీసుకున్నాడు. వాళ్లకు కూడా ఆయన ఓ సినిమా చేసి పెట్టాల్సి ఉంది. అయితే వేణు ఉడుగుల చేసినవి రెండే సినిమాలు అయినప్పటికీ బాగానే పేరు సంపాదించాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందాడు. సితార ఎంటర్ టైన్ మెంట్ లో రాబోతున్న మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిస్తే.. వేణు ఉడుగుల ఇమేజ్ ఓ రేంజ్ కు వెళ్లిపోతుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.