Begin typing your search above and press return to search.
నాగశౌర్య చేతికి మరో డిఫరెంట్ కాన్సెప్ట్!
By: Tupaki Desk | 20 Dec 2021 11:30 PM GMTనాగశౌర్య తనతోటి హీరోలతో పోటీపడాలనే ఉద్దేశంతో స్పీడ్ గానే పరుగెడుతున్నాడు. కానీ కాలమే కలిసి రావడం లేదు. ఈ ఏడాది ఆయన నుంచి వచ్చిన 'వరుడు కావలెను' .. 'లక్ష్య' రెండు సినిమాలు కూడా బోల్తా పడ్డాయి. ప్రస్తుతం ఆయన చేతిలో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' .. ' పోలీస్ వారి హెచ్చరిక' సినిమాలు ఉన్నాయి. మరో రెండు ప్రాజెక్టులు కూడా లైన్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది. ఈ సినిమాను రాజ్ డీకే నిర్మించనుండటం విశేషం.
రాజ్ నిడిమోరు - డీకే కృష్ణ ఇద్దరూ కూడా ఇంతకు ముందు 'డి ఫర్ దోపిడీ' సినిమాను నిర్మించారు. ఆ తరువాత 'సినిమా బండి' అనే మరో సినిమాకి కూడా నిర్మాతలుగా వ్యవహరించారు. 'ఫ్యామిలీ మేన్' వెబ్ సిరీస్ ఎంత సక్సెస్ అయిందనేది అందరికీ తెలిసిందే. ఆ వెబ్ సిరీస్ కి నిర్మాతలుగా వ్యవహరించింది వీరే. ఈ వెబ్ సిరీస్ వారికి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. మళ్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తీయాలనే ఉద్దేశంతో అందుకు సంబంధించిన ప్రయత్నాలను మొదలుపెట్టినట్టుగా చెబుతున్నారు.
ఇక పై గ్యాప్ రాకుండా తమ బ్యానర్లో ఒక మాదిరి బడ్జెట్ లో వరుసగా సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారట. కొత్త కాన్సెప్ట్ లకు .. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా చెబుతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ముందుగా నాగశౌర్యతో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. గతంలో తమ 'సినిమాబండి'కి దర్శకత్వం వహించిన ప్రవీణ్ కాండ్రేగుల తోనే ఈ సినిమాను నిర్మించనున్నారట. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయని అంటున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు .. సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందట. త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారకంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోనే ఈ ప్రాక్టును సెట్స్ పైకి తీసుకుని వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. తాను ఇంతవరకూ చేయని పాత్ర .. వైవిధ్యభరితమైన కథ కావడంతో నాగశౌర్య ఉత్సాహాన్ని కనబరుస్తున్నాడని అంటున్నారు. వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నాగశౌర్యకి, వచ్చే ఏడాదిలోనైనా హిట్లు పడతాయేమో చూడాలి.