Begin typing your search above and press return to search.
ఆ హీరోతో పవన్ మల్టీస్టారర్ అసలు నిజం ఏంటీ?
By: Tupaki Desk | 6 April 2020 12:10 PM GMTఒక వైపు కరోనా కారణంగా టాలీవుడ్ నిర్మాతలు బడా హీరోలతో సినిమాలు అంటేనే భయపడుతున్నారు. ఈ సమయంలో పెద్ద బడ్జెట్ సినిమాలు వచ్చేది అనుమానమే అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలకు కూడా కాస్ట్ కట్టింగ్ విధించే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాస్ రాజా రవితేజ కాంబోలో మల్టీస్టారర్ అంటూ ప్రచారం జరగడం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ మల్టీస్టారర్ మూవీకి మంచి క్రేజ్ ఉంది. ఇది నిజంగా వస్తే బాగుండు అని ప్రేక్షకులు అనుకుంటూ ఉండవచ్చు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మల్టీస్టారర్ వార్తలు నిజం కాదంటూ ఆయా హీరోల సన్నిహితులు చెబుతున్నారు.
అసలు విషయం ఏంటీ అంటే చాలా ఏళ్ల క్రితం నుండే వీరిద్దరి కాంబోలో ఒక మల్టీస్టారర్ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా మరోసారి అలాంటి వార్తలు ఈమద్య ఎక్కువ అయ్యాయి. వీరిద్దరి కాంబోకు సంబంధించిన సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ వార్తలు అన్ని కూడా అవాస్తవమే. గతంలో వీరిద్దరి కాంబో సినిమా కోసం ఇద్దరికి కూడా కథ వినిపించడం అయితే జరిగింది. కాని అది తదుపరి దశకు వెళ్లలేదు.
ఇక వీరిద్దరు కూడా ప్రస్తుతం వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇదే సమయంలో క్రాక్ సినిమాతో విడుదలకు రవితేజ రెడీ అయ్యాడు. ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్ ప్యాచ్ వర్క్ మిగిలి ఉందట. కాస్త తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాని వీరిద్దరు కలిసి మాత్రం ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే ఏడాది వరకు కరోనా ఎఫెక్ట్ తగ్గితే అప్పుడు వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుందేమో చూడాలి.