Begin typing your search above and press return to search.
విలక్షణ హీరో మరో ప్రయోగం
By: Tupaki Desk | 27 Oct 2021 5:16 AM GMTతమిళ హీరో ఆర్య ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈయన ఇటీవల నటించిన ఎనీమి సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. విశాల్ హీరోగా నటించిన ఆ సినిమా లో ఆర్య కీలక పాత్రలో నటించాడు. దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఎనీమిలో ఆర్య పాత్ర గురించి ప్రస్తుతం తమిళ మీడియా వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ సినిమానే కాకుండా ఆర్య మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. సినిమాలు వరుసగా చేస్తున్న ఆర్య తాజాగా మరో ప్రయోగాత్మక సినిమాను కమిట్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదల అవుతుందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఈమద్య కాలంలో జియో స్టూడియోస్ వారు వరుసగా సినిమాలను నిర్మిస్తున్నారు. రిలయన్స్ కు చెందిన ఈ నిర్మాణ సంస్థ ప్రస్తుతం సౌత్ పై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఆర్యతో ఒక ప్రయోగాత్మక సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమాను వారు ఓటీటీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట. మీడియం బడ్జెట్ తో ఆర్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథ మరియు కథనంతో ఈ సినిమా ను రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్య ఈ సినిమా తో నటుడిగా తనను తాను మరోసారి నిరూపించుకోవడం ఖాయం అంటున్నారు. ఆర్య ఈ వెబ్ మూవీ లో చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల టాక్.
జియో స్టూడియో లో ఆర్య హీరోగా రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్లడి అయ్యే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆర్య ప్రస్తుత సినిమాలతో పాటు త్వరలో చేయబోతున్న ఈ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఈయన సార్పట్ట సినిమా తో సక్సెస్ ను దక్కించుకున్నాడు. తెలుగు మరియు తమిళంలో ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కరోనా వల్ల సార్పట్ట సినిమా ను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా లో ఆర్య పాత్రకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.