Begin typing your search above and press return to search.

రకుల్‌ కు మరో మంచి ఛాన్స్‌

By:  Tupaki Desk   |   20 Aug 2021 4:26 AM GMT
రకుల్‌ కు మరో మంచి ఛాన్స్‌
X
తమిళంలో సూపర్‌ హిట్ అయిన రాత్ససన్ ను తెలుగు లో రాక్షసుడు అంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన విషయం తెల్సిందే. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన రీమేక్ కు మంచి విజయం దక్కింది. బెల్లంకొండకు మొదటి కమర్షియల్‌ విజయం దక్కింది అనడంలో సందేహం లేదు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ తో సైకో కిల్లర్‌ కథతో రూపొందిన రాక్షసుడు సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఈమద్య కాలంలో తెలుగు.. తమిళ సినిమా లను హిందీలో రీమేక్ చేయడం అనేది చాలా సాదారణమైన విషయం అయ్యింది. తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను హిందీలో స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ రీమేక్ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నాడు.

హిందీలో రాక్షసుడు సినిమాను చిన్న బడ్జెట్‌ సినిమాగా నెల రోజుల్లో ముగించే విధంగా అక్షయ్‌ కుమార్‌ ప్లాన్‌ చేశాడట. ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ కు జోడీ పాత్రలో సౌత్‌ స్టార్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను ఎంపిక చేయడం జరిగిందట. ఆమె ఇప్పటికే హిందీలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో స్టార్ డమ్‌ మాత్రం దక్కలేదు. కాని ఈ సినిమాలో ఆమె పాత్రకు కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కనుక నటిగా నిరూపించుకునేందుకు ఈ అమ్మడికి అవకాశం ఉంటుంది. మరి ఆ అవకాశంను ఈ అమ్మడు సద్వినియోగం చేసుకుంటుందా అంటే చూడాలి.

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ సినిమా అంటే హీరోయిన్స్ విషయంలో పట్టింపు ఉండదు. హీరోయిన్స్ ను జనాలు పట్టించుకోరు. కాని ఈ సినిమాలో హీరోయిన్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కనుక ఖచ్చితంగా సినిమాతో రకుల్‌ కు అక్కడ మంచి గుర్తింపు వస్తుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజాయన్ని సొంతం చేసుకుంటే రకుల్‌ కు అక్కడ ఓ అయిదు ఆరు సినిమాలు అయినా పడే అవకాశం ఉంది అనేది విశ్లేషకుల టాక్ ఇక రకుల్‌ నటించిన మెగా మూవీ కొండపొలం అక్టోబర్ లో విడుదలకు సిద్దం అయ్యింది. వైష్ణవ్‌ తేజ్ హీరోగా ఆసినిమా రూపొందిన విషయం తెల్సిందే.