Begin typing your search above and press return to search.
మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడా...?
By: Tupaki Desk | 19 Jun 2020 11:30 PMమెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదల వివాహం గురించి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో పాటు సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మెగా డాటర్ నిహారిక వెంకట చైతన్య అనే యువకుడిని పెళ్లాడబోతున్నట్లు ఆమె పెట్టిన ఫొటోలతో తెలిసిపోయింది. సినిమా ప్రమోషన్స్ మాదిరిగా ఫస్ట్ లుక్.. తర్వాత టీజర్.. ట్రైలర్ అన్నట్లు నిహారిక కూడా తనకు కాబోయే భర్తని అలానే రివీల్ చేసింది. ముందుగా కాఫీ కప్ మీద 'Mrs.?' అని పెళ్లి గురించి హింట్ ఇచ్చిన మెగా డాటర్ ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ లో చైతన్య ఫేస్ కనిపించకుండా అతన్ని హగ్ చేసుకుని ఉన్న ఫోటో పోస్ట్ చేసింది. 'వరుడు' సినిమాలో హీరోయిన్ ని దాచిపెట్టినట్లు దాచిపెట్టి ఫైనల్ గా సోషల్ మీడియా మాధ్యమాల్లో నిహారిక చైతన్యతో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేసి అందరికి తనకు కాబోయే వరుడిని పరిచయం చేసింది. నిహారిక పెళ్లి నిశ్చయయిందని న్యూస్ బయటకు రాగానే మెగా అభిమానులు సినీ ప్రముఖులు ఆమెకు విషెస్ చెప్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఫిల్మ్ సర్కిల్స్ మధ్య దీనిపై కొన్ని కామెంట్స్ కూడా రన్ అవుతున్నాయి.
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవితో మొదలుపెడితే మొత్తం కలుపుకుని దాదాపుగా పదకొండు మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చిరంజీవి - పవన్ కళ్యాణ్ - నాగబాబు - రామ్ చరణ్ - అల్లు అర్జున్ - అల్లు శిరీష్ - వరుణ్ తేజ్ - సాయిధరమ్ తేజ్ - వైష్ణవ్ తేజ్ - కళ్యాణ్ దేవ్ - నిహారిక ఇలా పదకొండు ఉన్నారు. ఇక మెగా కాంపౌండ్ లోని ఉన్న నిర్మాతల్ని, హీరోయిన్లని, టెక్నీషియన్లని లెక్క పెడితే ఇండస్ట్రీలో సగం మంది మెగా ట్యాగ్ ఉన్న వారే కనిపిస్తారనే టాక్ ఉంది. ఇప్పుడు నిహారిక చేసుకోబోయే అబ్బాయి చైతన్య కూడా మంచి లుక్స్ హైట్ తో బాగానే ఉన్నాడు. దీంతో ఏమో ఫ్యూచర్ లో మనోడుని కూడా హీరోగా లాంఛ్ చేస్తారేమో అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి రెండో కూతురు శ్రీజ రెండో భర్త కళ్యాణ్ దేవ్ ని కూడా అలానే జనాల మీద రుద్దేస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిహారికకి కాబోయో వరుడిని కూడా వెండితెరకు పరిచయం చేసే అవకాశాలు లేకపోలేదని.. ఇదే జరిగితే మొత్తం మెగా ఫ్యామిలీ నుండి ఇంట్రడ్యూస్ అయిన వారి సంఖ్య డజనుకు చేరుకుంటుందని అని డిస్కస్ చేసుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి ట్రెండ్ చేసేస్తున్నారు. అంతేకాకుండా అతనికి 'మెగా ప్రిన్స్ పవర్ సుప్రీమ్ టవర్ స్టార్' అని ట్యాగ్ లైన్ కూడా ఇచ్చేసారు నెటిజన్స్. మరి నెటిజన్స్ భావిస్తున్నట్లే మరో మెగా హీరో టాలీవుడ్ కి పరిచయం అవుతాడేమో చూడాలి.