Begin typing your search above and press return to search.

మళ్లీ బావగారి ఫ్యామిలీ నుండి హీరో..

By:  Tupaki Desk   |   4 Jan 2018 10:52 PM IST
మళ్లీ బావగారి ఫ్యామిలీ నుండి హీరో..
X
సాధారణంగా ఫ్యామిలీల్లో ఎవరన్నా సినిమాల్లో ఉంటే.. పిల్లలను సినిమాల్లోకి పంపరు. కాని అది 70లలో మాట. అందుకే సావత్రి.. శోభన్ బాబు.. ఇలా ఎవ్వరికీ నటవారసులు లేనేలేరు. అయితే ఇప్పుడు మాత్రం ట్రెండ్ వేరు. ఫ్యామిలీల్లో ఒక్కరుంటే చాలు.. ఆటోమ్యాటిక్ గా తక్కిన వారసులందరూ ఇటే వస్తున్నారు. మెగా.. నందమూరి.. అక్కినేని.. దగ్గుబాటి.. ఫ్యామిలీల హీరోలు ఆల్రెడీ ఏలేస్తున్న వేళ.. మహేష్‌ బాబు ఫ్యామలి నుండి కూడా చాలామంది యాక్టర్లే ఉన్నారు.

అయితే మహేష్‌ ఫ్యామిలీలో సొంతంగా ఘట్టమనేని వారసులే కాకుండా.. మహేష్‌ అక్క మొగుడు సుధీర్ బాబు కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత పెద్ద బావ గల్లా జయదేవ్ ఫ్యామిలీ నుండి కూడా నటులు వస్తున్నారు. ఆల్రెడీ జయదేవ్ కొడుకు డెబ్యూ గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నవేళ.. ఆ మధ్యన జయదేవ్ పిన్ని కొడుకు కృష్ణ మాధవ్.. హృదయం ఎక్కడ ఉన్నది అనే సినిమాతో హీరోగా పలకరించాడు. ఇప్పుడు జయదేవ్ సోదరి డా.రమాదేవి కుమారుడు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట.

పైగా ఇప్పటికే మహేష్‌ బాబు నిర్మాత దిల్ రాజుతో వంశీ పైడిపల్లి డైరక్షన్లో సినిమా చేస్తున్నందున.. ఈ కొత్త కుర్రాడి డెబ్యూ విషయం సూపర్ స్టార్ ఈ ప్రొడ్యూసర్ కే అప్పగించాడట. అంటే 2018లో ఈ కుర్రాడు తెర మీదకు వచ్చేస్తాడు.