Begin typing your search above and press return to search.
సూపర్ సీనియర్లకు మరో హీరో తోడు కావలెను..!
By: Tupaki Desk | 21 July 2022 6:30 AM GMT'ఆచార్య' తర్వాత మెగాస్టార్ చిరంజీవి మూడు చిత్రాలను సెట్స్ మీదకు తీసుకొచ్చారు.. నాలుగో ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే ఇదో సినిమా గురించి హింట్ ఇచ్చారు. అయితే ఈ లైనప్ లో కొన్ని సినిమాలలో చిరు సోలోగా కాకుండా తోడుగా మరో హీరో కూడా ఉండటం గమనార్హం.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమాలో చిరంజీవి తోపాటుగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించిన సంగతి తెలిసిందే. అలానే మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు.
చిరంజీవి మరియు కేఎస్ రవీంద్ర (బాబీ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం మాస్ మహారాజా రవితేజను తీసుకున్నారు. ఇటీవలే రవితేజ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అయితే ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న 'భోళా శంకర్' సినిమాలోనూ మరో హీరోని భాగం చేస్తారని టాక్ నడుస్తోంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి - తమన్నా భాటియా జంటగా నటిస్తున్న సినిమా 'భోళాశంకర్'. ఇందులో చిరు సోదరిగా కీర్తి సురేష్ కనిపించనుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో మరో హీరోని భాగం చేయాలని చూస్తున్నారని.. దీని కోసం నితిన్ - నాని వంటి యువ హీరోలను తీసుకుకోవాలని చూస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ సీనియర్ హీరోలలో ఒకరైన చిరంజీవి.. ఇకపై ప్రతీ సినిమాకు ఎవరో ఒక హీరోని తోడుగా తీసుకుంటారేమో అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి.
వాస్తవానికి తెలుగులో పాన్ ఇండియా సినిమాలు మరియు మల్టీస్టారర్ చిత్రాల సందడి మొదలైన తర్వాత పలువురు స్టార్స్ ని ఒకే సినిమాలో చూపించడానికి ఫిలిం మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. స్టార్ హీరోలు సైతం మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోడానికి రెడీగా ఉంటున్నారు.
కొందరు కథకు అవసరం కాబట్టి ఇలా చేస్తుంటే.. మరికొందరు బిజినెస్ మరియు క్రేజ్ కోసం ఇతర హీరోలతో స్పెషల్ రోల్స్ చేయిస్తున్నారు. చిరంజీవి విషయానికొస్తే.. 'సైరా నరసింహారెడ్డి' పాన్ ఇండియా మూవీ కాబట్టి అమితాబ్ బచ్చన్ - విజయ్ సేతుపతి - సుదీప్ వంటి స్టార్స్ ని తీసుకోవాల్సి వచ్చింది.
ఇక 'గాడ్ ఫాదర్' లో సల్మాన్ కోసం స్పెషల్ గా ఆ పాత్రని డిజైన్ చేయలేదు. ఒరిజినల్ వర్సన్ 'లూసిఫర్' చిత్రంలో ఉన్న క్యారక్టరే అది. అలానే బాబీ సినిమాలో మరో పాత్రకు చోటు ఉంటుందని మొదటి నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 'భోళాశంకర్' విషయంలో వస్తున్న రూమర్స్ ఎంతవరకు నిజమనేది చూడాలి.
చిరంజీవి ఒకేసారి రెండు మూడు సినిమాలో ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల ఎక్కువగా ఫోకస్ అయింది కానీ.. అక్కినేని నాగార్జున - వెంకటేష్ దగ్గుబాటి - పవన్ కళ్యాణ్ వంటి హీరోలు కూడా ఇతర హీరోల సపోర్ట్ తీసుకుంటూ వస్తున్నారు.
'వెంకీమామ' చిత్రంలో మేనల్లుడు నాగచైతన్య తో కలిసి నటించిన వెంకీ.. 'ఎఫ్ 2' 'ఎఫ్ 3' వంటి సినిమాల్లో వరుణ్ తేజ్ తో స్క్రీన్ పంచుకున్నారు. 'బంగార్రాజు' లో తనయుడు చైతూతో కలిసి నటించిన నాగ్.. ఇంతకముందు పలు చిత్రాలలో ఇతర హీరోలతో నటించారు. 'గోపాల గోపాల' 'భీమ్లా నాయక్' వంటి సినిమాలలో పవన్ తో పాటుగా మరో హీరో పాత్ర కూడా ఉంటుంది.
ఇలా పాపులర్ స్టార్స్ కలిసి నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడున్న సూపర్ సీనియర్ హీరోలలో ఒక్క నందమూరి బాలకృష్ణ మాత్రం వేరే హీరోని తీసుకోకుండా.. ద్విపాత్రాభినయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో బాలయ్య కూడా మరొకరిని తోడుగా తీసుకుంటారేమో చూడాలి.