Begin typing your search above and press return to search.

సామ్ బాలీవుడ్ ప్లాన్ కు మరో హీరోయిన్ హెల్ప్‌

By:  Tupaki Desk   |   2 Nov 2021 11:29 AM GMT
సామ్ బాలీవుడ్ ప్లాన్ కు మరో హీరోయిన్ హెల్ప్‌
X
బాలీవుడ్ లో బిజీ అవ్వాలని సమంత ఆశ పడుతుందని గత కొన్ని రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్న విషయం తెల్సిందే. సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా హిందీ ప్రేక్షకులకు బాగానే నోటెడ్‌ అయినట్లుగా టాక్ వినిపిస్తుంది. అందుకే ఈమెకు అక్కడ వరుసగా ఆఫర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే బాలీవుడ్‌ లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న సమంత వచ్చే ప్రతి సినిమాను కమిట్‌ అవ్వకుండా కాస్త ఆచి తూచి అడుగులు వేయాలనే ఉద్దేశ్యంతో ప్లాన్ చేస్తోంది. తన కంటే బాలీవుడ్‌ లో సీనియర్ అయిన తాప్సి నుండి సమంత హెల్ప్‌ తీసుకోబోతుందా అంటే ఔను అనే వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్‌ లో సినిమాను చేసేందుకు గాను సిద్దం అయిన సమంత తో తాప్సి ఒక సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యిందట.

తాప్సి ఇప్పటికే బాలీవుడ్‌ లో చాలా సినిమాలు చేసింది. అక్కడ మంచి విజయాలను దక్కించుకుంది. అక్కడ ఎలాంటి సబ్జెక్ట్ లు ఎంపిక చేసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది అనేది తాప్సి కి బాగా తెలుసు. అందుకే సమంత ఆమెను నమ్మినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే తాప్సి ఒక ప్రొడక్షన్‌ హౌస్ ను ప్రారంభించించింది. ఇప్పటికే ఆ బ్యానర్‌ లో సినిమా ల నిర్మాణం మొదలు పెట్టింది. సమంతతో ఆ బ్యానర్‌ లో తాప్సి ఒక సినిమాను నిర్మించేందుకు గాను ఏర్పాట్లు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక ప్రముఖ దర్శకుడు ఇప్పటికే కథను సిద్దం చేయడం జరిగిందని.. తాప్సికి ఆ కథ నచ్చడంతో సమంతతో ఆ సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఆ విషయమై మరింత క్లారిటీ స్పష్టత వస్తుందని అంతా ఆశిస్తున్నారు.

సమంత కు బాలీవుడ్‌ లో ఖచ్చితంగా తాప్సి వల్ల ఒక మంచి ఎంట్రీ దక్కుతుందనే ఆశా భావం అందరు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు డ్రీమ్‌ వారియర్‌ బ్యానర్‌ లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ను కూడా సమంత చేసేందుకు ఓకే చెప్పడం జరిగింది.. అది ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ హీరోలతో నటించిన సమంత ఇప్పుడు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాన్ని బాలీవుడ్‌ లో చేయనుందా లేదంటే.. హీరోయిన్ గా హీరోతో కమర్షియల్‌ సినిమా చేస్తుందా అనేది చూడాలి. తెలుగు లో ఈ అమ్మడు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే శాకుంతలం సినిమా షూటింగ్‌ ను ముగించింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఒక ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ లో కూడా సమంత నటించింది. ఆ సినిమాలో విజయ్ సేతుపతి మరియు నయనతార లు కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. సామ్‌ బ్రేకప్‌ తర్వాత సినిమాలతో బిజీ అవ్వాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా బాలీవుడ్‌ సినిమాలతో బిజీ అవ్వాలని సమంత కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.