Begin typing your search above and press return to search.

RRRకు మరో హాలీవుడ్ డైరెక్టర్ ఫిదా

By:  Tupaki Desk   |   17 July 2022 5:42 PM GMT
RRRకు మరో హాలీవుడ్ డైరెక్టర్ ఫిదా
X
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన RRR సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా సక్సెస్ అయిన అనంతరం ఓటీటీ లో కూడా అదే తరహాలో రెస్పాన్స్ అందుకోవడం విశేషం. కేవలం ఇండియాలోనే కాకుండా ఎక్కువగా విదేశీ ప్రేక్షకులు ఈ సినిమాను అమితంగా లైక్ చేస్తూ ఉండడం విశేషం.

ఇక అందులో ప్రముఖ హాలీవుడ్ తారలు కూడా ఉన్నారు. ఈ సినిమాపై మరో సంచలన హాలీవుడ్ దర్శకుడు ప్రశంసలు కురిపించాడు. ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్, డాక్టర్ స్ట్రేంజ్ అలాగే ఇటీవల విడుదలైన ది బ్లాక్ ఫోన్‌ సినిమాలతోనే ఎంతగానో ఆకట్టుకున్న స్కాట్ డెరిక్సన్ RRR సినిమాను చూసి ఫిదా అయ్యాడు. ట్విట్టర్ లో కూడా అతను ఒక మంచి కామెంట్ చేశాడు.

నిన్న రాత్రి నా పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే నా భార్య, పిల్లలు RRR చలనచిత్రాన్ని చూశాము. ఇది చలనచిత్రం యొక్క అద్భుతమైన రోలర్ కోస్టర్. చాలా నచ్చేసింది. అని ఆయన తెలియజేశారు. ఎనిమాల్స్ ను విడుదల చేసిన ఇంటర్వెల్ ఫైట్ కూడా ఎంతగానో మెచ్చేసిందని అతను పేర్కొన్నాడు. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయినప్పటి నుంచి అందుకుంటున్న ప్రశంసలతో రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

సాధారణంగా వెండితెరపై భారీ స్థాయిలో సక్సెస్ అయిన సినిమాలు ఆ తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కావడం లేదు. కానీ RRR సినిమా మాత్రం అందుకు భిన్నంగా విదేశీయులను కూడా ఆకట్టుకోవడం విశేషం. ప్రతిరోజు ఎవరో ఒక హాలీవుడ్ సెలబ్రిటీ ఈ సినిమాపై స్పందిస్తున్న విధానం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రతి ఒక్క సన్నివేశం కూడా చాలా అద్భుతంగా ఉంది అని దర్శక ధీరుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి దర్శకుడికి మరింత ఎక్కువ బడ్జెట్ ఇస్తే ఇంకా అద్భుతమైన సినిమాలు చేస్తారని కూడా మరి కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.