Begin typing your search above and press return to search.

600 మిలియన్ క్లబ్ లో చేరిన ఫస్ట్ తెలుగు సాంగ్ గా 'బుట్టబొమ్మ' రికార్డ్..!

By:  Tupaki Desk   |   4 May 2021 6:30 AM GMT
600 మిలియన్ క్లబ్ లో చేరిన ఫస్ట్ తెలుగు సాంగ్ గా బుట్టబొమ్మ రికార్డ్..!
X
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' మూవీ సక్సెస్ లో మ్యూజిక్ మేజర్ రోల్ ప్లే చేసిందని చెప్పవచ్చు. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చాడు. థమన్ ఇచ్చిన పాటలు సెన్షేషన్ ని క్రియేట్ చేశాయి. 'అల..' ఆల్బమ్ వచ్చి ఏడాది దాటినా పాటలు మాత్రం అలా మోగుతూనే ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు.ముఖ్యంగా 'సామజవరగమనా' 'రాములో రాములా' 'బుట్టబొమ్మ' వంటి సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ దక్కించుకున్నాయి. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలైన 'బుట్టబొమ్మ' పాట తాజాగా మరో మైలురాయిని మార్క్ ని అందుకుంది.

'బుట్టబొమ్మ' సాంగ్ యూట్యూబ్ లో 600 మిలియన్లకు పైగా వ్యూస్.. సుమారు 40 మిలియన్ లైక్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఎవర్ తెలుగు తెలుగు సాంగ్ గా 'బుట్టబొమ్మ' సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. థమన్ అందించిన అద్భుతమైన బాణీకి అనువైన సాహిత్యం, వినసొంపైన గాత్రం ఈ పాట ఇంతటి విశేష ఆదరణ దక్కించుకోవడానికి కారణమని చెప్పవచ్చు. 'ఇంత కన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో..' అంటూ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అందించిన క్యాచీ లిరిక్స్.. సింగర్ అర్మాన్ మాలిక్ వాయిస్ శ్రోతలను ఆకట్టుకున్నాయి. త‌మ‌న్ ట్యూన్ కి తగ్గట్టుగా బ‌న్నీ చేసిన గ్రేస్ డ్యాన్స్.. పూజాహెగ్డే అందాలు దీనికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ క్రమంలో జ‌నాల గుండెల్లోకి సూటిగా గుచ్చుకుపోయిన 'బుట్టబొమ్మ' సాంగ్ భాషతో ప్రాంతంతో సంబంధం లేకుండా రికార్డులు క్రియేట్ చేస్తోంది.