Begin typing your search above and press return to search.

మాస్టర్‌ జోరుకు రికార్డులన్ని బద్దలు

By:  Tupaki Desk   |   27 Nov 2020 7:15 AM GMT
మాస్టర్‌ జోరుకు రికార్డులన్ని బద్దలు
X
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ మరోసారి తన సత్తా చాటాడు. ఆయన నటించిన 'మాస్టర్‌' సినిమా టీజర్ రికార్డులన్నింటిని బ్రేక్‌ చేసి యూట్యూబ్‌ లో వీర విహారం చేస్తోంది. వ్యూస్‌ మరియు లైక్స్‌ విషయంలో తమిళ ఆడియన్స్‌ ముఖ్యంగా విజయ్‌ ఫ్యాన్స్‌ సరికొత్త రికార్డులను నమోదు చేశారు. వారం గ్యాప్‌ లోనే ఏకంగా 40 మిలియన్‌ ల వ్యూస్‌ ను ఈ టీజర్‌ దక్కించుకుంది. ఇక లైక్స్‌ విషయంలో కూడా గత రికార్డులను సునాయాసంగా బ్రేక్‌ చేసింది. దాదాపుగా 2.5 మిలియన్‌ లైక్స్‌ తో సౌత్‌ లోనే టాప్‌ లో నిలిచింది. మాస్టర్‌ సినిమాపై విజయ్‌ అభిమానుల్లో అంచనాలకు ఇది ఒక నిదర్శణంగా చెప్పుకోవచ్చు.

సూపర్ స్టార్‌ విజయ్‌ తో విలక్షణ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ రూపొందించిన మాస్టర్‌ సినిమా కు ఇంత క్రేజ్‌ ఉండటం మేకర్స్‌ కూడా ఆశ్చర్యపోతున్నారు. కొత్త దర్శకుడితో విజయ్‌ చేసిన సినిమాకు ఎందుకు ఇంత హైప్‌ అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక్కడ దర్శకుడు విషయం కాదని విజయ్‌ ఏ సినిమా చేసినా.. ఎవరి దర్శకత్వంలో చేసినా కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని.. ప్రోమో కూడా అభిమానులు మళ్లీ మళ్లీ చూసేలా ఉందని అందుకే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అంటూ తమిళ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.