Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కి మ‌రో లేడీ డైరెక్ట‌ర్!

By:  Tupaki Desk   |   22 Nov 2022 7:41 AM GMT
టాలీవుడ్ కి మ‌రో లేడీ డైరెక్ట‌ర్!
X
టాలీవుడ్ లో లేడీ డైరెక్ట‌ర్లు ఎవ‌రు? అంటే గ‌ట్టిగా వినిపించే ఒకే ఒక్క పేరు నందిని రెడ్డి. ఆమె కూడా మీడియం రేంజ్ సినిమాలు త‌ప్ప ఇంత‌వ‌ర‌కూ స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేయ‌లేదు. మేల్ డైరెక్ట‌ర్స్ నుంచి గ‌ట్టి పోటీ ఉన్నా? స‌రైన కంటెంట్ తో వెళ్తే ఆమెకి ఏ హీరో కూడా నో చెప్ప‌రు అన్న‌ది వాస్త‌వం. ఆ ర‌క‌మైన ప్ర‌య‌త్నాలు చేస్తున్నప్ప‌టికీ ఫ‌లించ‌డం లేదు.

మ‌రి డైరెక్ట‌ర్ల స్థానంలో టాప్ లీగ్ లో ఎప్పుడు చేర‌తారు? అన్న‌ది చూడాలి. స‌రిగ్గా ఇదే అవ‌కాశాన్ని వినియోగించుకోవ‌డానికి నేచుర‌ల్ స్టాని సోద‌రి దీప్తి గంటా ద‌ర్శ‌కురాలిగా ఎంట్రీ ఇస్తున్నారు. 'మీట్ క్యూట్' అనే వెబ్ సిరీస్ తో ఆమె ద‌ర్శ‌కురాలిగా పరిచయం అవుతున్నారు. మ‌ద్ద‌తుగా నాని నిలవ‌డంతో ఆమె నెట్టింట బాగానే వైరల్ అవుతున్నారు.

ఈ వెబ్ సిరీస్ గురించి నాని సోద‌రుడిగా రివ్యూ ఇచ్చాడా? లేక నిజంగా విష‌యం ఉంది కాబ‌ట్టి రివ్యూ ఇచ్చాడా? తెలియ‌దుగానీ సోద‌రి ప్ర‌తిభ‌ని మాత్రం పొగిడేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ని నాని స్వ‌యంగా త‌న వాల్ పోస్టర్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నాని సోద‌రిని ఆకాశానికి ఎత్తేసారు.

'స్ర్కిప్ట్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. మా సిస్టర్ కాక‌పోయినా ఈ క‌థ‌తో ఎవ‌రూ అప్రోచ్ అయినా నేను నిర్మించేవాడిని. ఇందులో పాత్ర‌లు..మాటలు అన్ని స‌హ‌జంగా ఉంటాయి' అని అన్నారు. మొత్తానికి సోద‌రిలో ప్ర‌తిభ‌ని గుర్తించి నాని బాగానే ప్రోత్స‌హిస్తున్నాడు. టాలీవుడ్ లో ఎలాగూ టాప్ లేడీ చైర్ చాలా కాలంగా ఖాళీగా నే ఉంటుంది.

ఇప్పుడా స్థానంలో సొద‌రిని కూర్చోబెట్టాలి అన్న‌ది నాని ప్లాన్ గా క‌నిపిస్తోంది. ఆర‌కంగా నాని డ్రీమ్ కూడా పుల్ ఫిల్ అవుతుంది. డైరెక్ట‌ర్ కాబోయ్ నాని న‌టుడైన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి నాని ద‌ర్శ‌క‌త్వం వైపు చూసింది లేదు. హీరోగానే స్థిర‌ప‌డిపోయారు. క‌నీసం సోద‌రినైనా ద‌ర్శ‌కురాలిగా చూసుకుని మురిసిపోవాల‌ని నాని భావిస్తున్నట్లున్నాడు.

మ‌రి నాని ప్లాన్ వ‌ర్కౌట్ అవ్వాల‌ని ఆశిద్దాం.ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్ కంటెంట్ కి మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. అక్క‌డ నుంచే వెండి తెర ద‌ర్శ‌కులుగా ప్ర‌మోట్ అవుతున్నారు. మ‌రి దివ్య సంగ‌తేంటో తేలాలంటే? ఈనెల 25 వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.