Begin typing your search above and press return to search.
మరో మైల్ స్టోన్ రీచ్ అయిన బన్నీ చిత్రం.. సౌత్ లోనే నెం.1
By: Tupaki Desk | 10 Feb 2021 10:48 AM GMTసినిమా సక్సెస్ ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ లో స్టోరీ తర్వాత ప్లేస్ లో పాటలే ఉంటాయి. ఈ విషయాన్ని గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. లేటెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే.. 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని చూపించొచ్చు! కరోనా లాక్ డౌన్ కు ముందు విడుదలైన చిత్రాల్లో ఈ 'అల వైకుంఠపురములో' ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రం విజయంలో పాటలు ఎలాంటి రోల్ ప్లే చేశాయో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.
ఈ అద్భుతమైన ఆల్బమ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గిటార్ నుంచి జాలువారింది. అంతకు మించి అన్నట్టుగా ప్రతీ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అది ఎంతలా అంటే.. యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొట్టేంతగా! టాలీవుడ్ లోనే కాదు.. ఏకంగా సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్ గ్రాబ్ చేసేంతగా!
గతేడాది సంక్రాంతి కానుకగా.. జనవరి 12న రిలీజ్ అయ్యిందీ మూవీ. అయితే.. అంతకు ముందే ఒక్కొక్క పాటను విడుదల చేసింది యూనిట్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్యూటీఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే కాంబోలో వచ్చిన ఈ మూవీ.. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించింది. ఇక, ఈ సినిమా పాటలు రచ్చ రంబోలా చేసేశాయి.
ఈ ఆల్బమ్ లోని "రాములో రాముల" అనే మాస్ బీట్ కు.. యావత్ ప్రేక్షకలోకం చిందేసింది. బయట కాలు కదపలేనివారు కూడా మనసులో డ్యాన్స్ చేసేశారు. అలాంటి సాగ్.. యూ ట్యూబ్ లో అరుదైన రికార్డు సాధించింది. అటు లిరికల్ సాంగ్ తోపాటు ఫుల్ వీడియో సాంగ్ కూడా నెవ్వర్ బిఫోర్ వ్యూస్ ను నమోదు చేసింది.
ఈ పాట ఏకంగా 300 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి, ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ అండ్ ఒన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియా సాంగ్ గా రికార్డు నమోదు చేసింది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు పలు రికార్డులు నమోదు చేయగా.. లేటెస్ట్ గా ఈ రికార్డు కూడా యాడ్ అయ్యింది. దీంతో.. గతేడాది మొదలైన 'అల వైకుంఠపురములో' పాటల ప్రభంజనం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.