Begin typing your search above and press return to search.
ఈ వారం మరో మినీ బాక్సాఫీస్ వార్
By: Tupaki Desk | 22 Nov 2022 2:30 AM GMTఅక్టోబర్ దసరా తర్వాత మళ్లీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే సినిమాలు చాలా తక్కువగానే వచ్చాయి. కన్నడ డబ్బింగ్ మూవీ కాంతార తప్పితే మళ్ళీ తెలుగులో మంచి ప్రాఫిట్ లోకి వచ్చిన సినిమాలు చాలా తక్కువ. సమంత యశోద సినిమా ఏదో పర్వాలేదు అనిపించింది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఆ సినిమా అన్ని ఏరియాలలో లాభాల్లోకి అయితే రాలేదు.
గత వారం వచ్చిన గాలోడు, మసూద టాక్ ను బట్టి వీకెండ్ ను బాగానే యూజ్ చేసుకున్నాయి. ఇక ఇప్పుడు నవంబర్ 4 వారంలో అంటే ఈ శుక్రవారం థియేటర్లోకి మరికొన్ని డిఫరెంట్ సినిమాలు రాబోతున్నాయి. ఇక అందులో తెలుగులో చెప్పుకోదగ్గ స్ట్రైట్ మూవీ అల్లరి నరేష్ ది మాత్రమే ఉంది. అల్లరి నరేష్ నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా అక్టోబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
గత నెలలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ నుంచి నరేష్ కాస్త బాగానే ఏట్రాక్ట్ చేశాడు. ఎన్నికలకు సంబంధించిన ఒక పాయింట్ ఈ సినిమాలో హైలెట్ కాబోతోంది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఈ సినిమాపై ఎక్కువగా ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది.
ఇక బాలీవుడ్ లో అదే రోజు విడుదలవుతున్న బెడియా సినిమా తెలుగులో తోడేలుగా విడుదల కాబోతోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ దావన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కృతి సనోన్ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు ఇటీవల తమిళంలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న లవ్ టుడే సినిమాను డబ్ చేసి విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.
ఈ శుక్రవారం లవ్ టూడే సినిమా కూడా కాస్త ఎక్కువ ధియేటర్లలో విడుదల కాబోతోంది. తమిళంలో హిట్ అయింది కాబట్టి తెలుగు వారికి కూడా కంటెంట్ నచ్చితే సినిమాను ఎగబడి చూసే ఛాన్స్ అయితే ఉంది. ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త ఎక్కువ స్థాయిలో ప్రభావం చూపే సినిమాలు అయితే ఇవే ఉన్నాయి.
ఇక వీటితో పాటు మరో రెండు చిన్న సినిమాలు కూడా అదే రోజు విడుదలవుతున్నాయి. రణస్థలి, చెడ్డి గ్యాంగ్ తమాషా.. అనే రెండు చిన్న సినిమాలు కంటెంట్ ద్వారానే ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేయబోతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ అందుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.