Begin typing your search above and press return to search.

మరో '96' కు ఏర్పాట్లు !!

By:  Tupaki Desk   |   1 Sep 2021 12:30 AM GMT
మరో 96 కు ఏర్పాట్లు !!
X
టాలీవుడ్‌ స్టార్‌ విజయ్ సేతుపతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌ అనడంలో సందేహం లేదు. తెలుగు లో విజయ్ సేతుపతికి ఇంతగా గుర్తింపు రావడంకు కారణం ఆయన నటించిన '96'. తమిళంలోనే ఆ సినిమా వచ్చినా కూడా తెలుగు ఆడియన్స్ కు కూడా సబ్‌ టైటిల్స్ తో ఆ సినిమాను తెగ చూశారు. ఆ సినిమా ను తెలుగు లో జాను గా రీమేక్ చేశారు. ఒరిజినల్ వర్షన్ 96 ను విజయ్‌ సేతుపతి మరియు త్రిషలు చేస్తే తెలుగు లో జాను ను శర్వానంద్ మరియు సమంతలు చేసిన విషయం తెల్సిందే. తెలుగు మరియు తమిళంలో కూడా ప్రేమ్‌ కుమార్ దర్శకత్వం వహించాడు.

విభిన్న చిత్రాల దర్శకుడిగా యూనిక్‌ కాన్సెప్ట్‌ లు ఎంపిక చేసుకునే దర్శకుడిగా ప్రేమ్‌ కుమార్ కు మంచి పేరు వచ్చింది. అలాంటి ప్రేమ్‌ కుమార్ మరో 96 కు రెడీ అవుతున్నాడా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తుంది. కోలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి హీరోగా ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో త్వరలో ఒక సినిమా పట్టాలెక్కబోతుంది. ఈసారి కేవలం తమిళంలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినిమా గా రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారని కోలీవుడ్‌ మీడియా వర్గాల వారు అంటున్నారు.

విజయ్‌ సేతుపతి తెలుగు మరియు హిందీల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ సమయంలో ఆయన తో ప్రేమ్‌ కుమార్ సినిమా అంటే ఖచ్చితంగా మరో రేంజ్ లో ఉంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న వీరి కాంబో మూవీ గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సినిమా షూటింగ్‌ లతో విజయ్‌ సేతుపతి బిజీగా ఉండగా దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ మాత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ తో బిజీగా ఉన్నాడని అంటున్నారు. మరో 96 రేంజ్‌ లో వీరి కాంబో కొత్త సినిమా ఉంటే మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు.