Begin typing your search above and press return to search.
మరో పెళ్ళిచూపులు.. వర్క్ అవుట్ అవుతుందా?
By: Tupaki Desk | 4 Dec 2019 10:32 AM GMTటాలీవుడ్ లో వారసుల రాక కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. శివ కందుకూరి నటించిన మొదటి సినిమా 'చూసి చూడంగానే' ట్రైలర్ నిన్నే విడుదలయింది. ట్రైలర్ చూస్తుంటే 'పెళ్ళిచూపులు' సినిమా స్టైల్ కనిపిస్తోంది. రాజ్ కందుకూరి తన వారసుడిని 'పెళ్ళిచూపులు' విజయ్ దేవరకొండ తరహాలో పరిచయం చేయాలని చేస్తున్న ప్రయత్నం కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది.
ఈ తరం ప్రేక్షకుల మెప్పు పొందేలా హీరో హీరోయిన్ల పాత్రల చిత్రణ.. ఆధునికంగా ఉండే హీరోయిన్ పాత్రలు చూస్తుంటే రాజ్ కందుకూరి నిర్మించిన 'పెళ్ళి చూపులు' సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలు గుర్తొచ్చేలా ఉన్నాయి. అయితే 'పెళ్ళిచూపులు' సినిమాలో లైఫ్ లో సెటిల్ కావాలని తపించే కుర్రాడి పాత్రలో విజయ్ ఒదిగిపోయాడు. దానికి కారణం విజయ్ ఒక మంచినటుడు కావడమే. ఆ పాత్రలో నటన అంతంత మాత్రమే ఉన్న హీరో అయితే ఆ ఫీల్ వచ్చేది కాదు. అలానే ఇప్పుడు 'చూసి చూడంగానే' సినిమా సంగతి చూస్తే శివ కందుకూరి కొత్త కుర్రాడు. శివ కనుక మంచి నటన కనబరిస్తే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 'పెళ్ళిచూపులు' ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తే ఈ సినిమా ఫ్రెష్ గా అనిపించకపోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఒకే ఫార్మాట్ వర్క్ అవుట్ అవుతుందని గ్యారెంటీ ఉండదు.
'చూసి చూడంగానే' సినిమా టైటిల్.. ఫస్ట్ సాంగ్.. ట్రైలర్ పాజిటివ్ గానే ఉన్నాయి కాబట్టి సినిమాకు సరైన ప్రమోషన్స్ చేస్తే మాత్రం ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి సినిమా రిలీజ్ కు ముందు ఎలా ప్రమోషన్స్ చేస్తారో వేచి చూడాలి.