Begin typing your search above and press return to search.
ఆ సినిమా కూడా ప్రణయ్ అమృతల ప్రేమ కథేనట
By: Tupaki Desk | 23 Jun 2020 8:30 AM GMTసంచలనం రేపిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం పరువు హత్యపై రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రణయ్ అమృత ప్రేమను జీర్ణించుకోలేక అమృత తండ్రి అయిన మారుతి రావు అత్యంత దారుణం గా ప్రణయ్ ను హత్య చేయించడం ఆ తర్వాత పరిణామాలతో తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం తో మారుతి రావు ఉదంతం అంతా కూడా సినిమాటిక్ గా ఉంటుంది. అందుకే ఈ రియల్ సంఘటనల ఆధారంగా వర్మ మర్డర్ సినిమాను ప్రకటించాడు. ఇదే కథాంశం తో ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ చిత్రం తెరకెక్కుతుందట.
చాలా రోజుల క్రితమే ప్రారంభం అయిన అన్నపూర్ణమ్మ గారి మనవడు చిత్రం కథాంశం కూడా ప్రణయ్ అమృతల ప్రేమ కథ ఆపై జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించడం జరిగిందని చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రణయ్ పాత్రను బాలాధిత్య పోషిస్తుండగా అమృత పాత్రను అర్చన పోషిస్తోంది. ఇక అమృత తండ్రి మారుతి రావు పాత్రలో ప్రముఖ నటుడు బెనర్జీ నటిస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యిందన్నారు.
నిర్మాత ఎంఎన్‌ఆర్ చౌదరి మాట్లాడుతూ కూతురు పై ప్రేమ తో ఆమె ప్రియుడిని బెనర్జీ చంపించే సీన్స్ చాలా బాగా దర్శకుడు శివ నాగు తీశాడు అన్నారు. ఇక దర్శకుడు శివ నాగు మాట్లాడుతూ మారుతి రావు పాత్రలో బెజర్జీ చాలా బాగా నటించారు. సినిమాకు ఆయన నటన హైలైట్ గా నిలుస్తుందని పేర్కొన్నారు.