Begin typing your search above and press return to search.
కిక్-2కు పెద్ద రిలీఫ్
By: Tupaki Desk | 26 Aug 2015 9:32 AM GMTఈ రోజుల్లో ఓ సినిమాకు ఏవరేజ్ అన్న టాక్ వచ్చినా కష్టమే. సోమవారం నుంచి బాక్సాఫీస్ బండి నడవడం చాలా కష్టమైపోతుంది. అలాంటిది నెగెటివ్ టాక్ వస్తే ఇంకేమైనా ఉందా? అందులోనూ భారీ బడ్జెట్ సినిమాలకు ఇలాంటి టాక్ వస్తే అంతే సంగతులు. జనాలు ఒకప్పట్లా గుడ్డిగా సినిమాకు వెళ్లిపోవట్లేదు. టాక్ తెలుసుకుని.. రివ్యూలు చదువుకుని.. అంతా ఓకే అనుకుంటే తప్ప సినిమాలకు కదలట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కిక్-2 సినిమా డివైడ్ టాక్ తో మొదలైంది. సెకండాఫ్ లో లాగ్ గురించి అందరికీ ఒకే అభిప్రాయం కావడంతో మొహమాటం లేకుండా రెండో రోజుకే 20 నిమిషాలు కోత వేసి వదిలారు. అయినప్పటికీ కిక్-2 పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. వీకెండ్ వరకు ఓకే కానీ.. సోమవారం నుంచి పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంది.
ఏదో సోసోగా అలా బండి లాగించేస్తోంది కిక్-2. సెకండ్ వీకెండ్ లో మళ్లీ పుంజుకోవచ్చులే అన్న ఆశ ఉంది. అదృష్టవశాత్తూ ఈ ఆశలు నెరవేరేలాగే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమా ఏదీ థియేటర్లలోకి రావట్లేదు. నందు, మధురిమ లాంటి చోటా తారలు నటించిన బెస్ట్ యాక్టర్స్, మంత్ర తులసీరామ్ దర్శకత్వం వహించిన క్రిమినల్స్, పూనమ్ పాండే ప్రధాన పాత్రలో తెరకెక్కిన మాలిని అండ్ కో లాంటి పెద్దగా ఆసక్తి రేపని సినిమాలు ఈ వారం విడుదలవుతున్నాయి. వచ్చేవారం ఎలాగూ డైనమైట్, భలే భలే మగాడివోయ్ లాంటి కొంచెం క్రేజ్ ఉన్న సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ వారానికైతే కిక్-2కు ఢోకా లేదు. శ్రీమంతుడుతో పాటు బాగానే కలెక్షన్లు పంచుకోవచ్చు. ఐతే ఎంత సంపాదించినా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రావడం కష్టమే. తక్కువ నష్టాలతో బయటపడొచ్చన్నదే ఊరట.