Begin typing your search above and press return to search.
ఓటీటీలకు అమ్మమ్మలాంటి మరో ఓటీటీ!
By: Tupaki Desk | 4 May 2022 9:30 AM GMTభారత్ లో ఓటీటీకి పెరుగుతోన్న ఆదరణ గురించి చెప్పాల్సిన పనిలేదు. కరోనా రాకతో ఓవర్ ద టాప్ కంటెంట్ అంటే ఏంటే? ఓ క్లారిటీ వచ్చింది. అప్పటివరకూ ఓ సెక్షన్ ఆడియన్స్ కి మాత్రమే పరమితమైన ఓటీటీ గురించి ఇప్పుడు ప్రతీ ఇంట పరిచయమే. సినిమాలు..వెబ్ సిరీస్ లు..స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇలా ఆడియన్ ఆలోచనని మించిన కంటెంట్ ఇప్పుడు ఓటీటీ అందిస్తోంది. ఓటీటీ టెక్నాలజీ ఇప్పుడు వరల్డ్ ని ఏల్తోంది.
వందల కోట్ల రూపాయల పెట్టుబడుల సినిమాల్ని సైతం కొనడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. కార్పోరేట్ కంపెనీలన్ని ఓటీటీ రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే భారత్ లో నెట్ ప్లిక్స్..అమెజాన్ ప్రైమ్..డిస్నీ హాట్ స్టార్ లాంటి ఓటీటీ సంస్థలు దిగ్విజయంగా దూసుకుపోతున్నాయి. కొత్త కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల్ని అలరించడానికి పోటీ పడుతున్నాయి.
మార్కెట్ లో నెంబర్ వన్ అనిపించుకోవడం కోసం నిరంతరం పోటీ పడి కంటెంట్ ని అందిస్తున్నాయి. డిస్నీ హాట్ స్టార్ లాంటి సంస్థ నెమ్మదించిన నేపథ్యంలో తెలుగు సినిమా మార్కెట్ పైనే ప్రత్యేకంగా శ్రద్ద పెట్టి సబ్ స్ర్కిప్షన్ పెంచుకుంటోంది. భవిష్యత్ ఎంటర్ టైన్ మెంట్ అంతా ఓటీటీలోనే అన్న నమ్మకం క్రమంగా బలపడుతోంది. దీంతో కొత్త కొత్త ఓటీటీ సంస్థలు మార్కెట్ లోకి వస్తున్నాయి.
సెలబ్రిటీలు సైతం ఈ రంగంలో రాణించాలని ఉత్సాహం చూపిస్తున్నారు. తమ సినిమాల్ని తామే సొంతంగా రిలీజ్ చేసుకునేలా కొత్త కొత్త ప్రణాళికలతో ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త ఓటీటీ సంస్థ భారత్ లో పోటీగా దిగుతుంది. 'పారామౌంట్ ప్లస్' పేరుతో ఓ దిగ్గజ కార్పోరేట్ కంపెనీకి చెందిన ప్లాట్ ఫామ్ 2023లో లాంచ్ చేయడానికి నిర్వాహకులు రెడీ చేస్తున్నారు.
ఇప్పటికే పారామౌంట్ ఓటీటీకి అంతర్జాతీయంగా మంచి పేరుంది. విదేశాల్లో బెస్ట్ ఓటీటీ కంటెంట్ ని అందించడంలో సంస్థ అగ్రగామిగా దూసుకుపోతుంది. తాజాగా దేశీయ మార్కెట్ లోకి దిగుతుంది. భారత్ లో అన్ని భాషల్లో పారామౌంట్ ని లాంచ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హాందీంతో పాటు సౌత్ లో అన్ని భాషల్లో పారామౌంట్ ఫేమస్ అయ్యే ప్రత్యేక ప్రణాళికతో రంగం సిద్దం చేస్తున్నట్లు వినిపిస్తుంది.
దీంతో నెట్ ప్లిక్స్..అమెజాన్ ప్రైమ్..డిస్నీ హాట్ స్టార్ లాంటి సంస్థలకు గట్టి పోటీగా నిలబడటం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే పారామౌంట్ 'హలో'..'1883'.. 'స్టార్ ట్రెక్' లాంటి షోలతో అంతర్జాతీయంగా బాగా ప్రాచుర్యం పొందింది.