Begin typing your search above and press return to search.

లేడీ సూపర్ స్టార్‌ నుండి మరో ఓటీటీ ప్రాజెక్ట్‌

By:  Tupaki Desk   |   13 Jun 2021 11:30 AM GMT
లేడీ సూపర్ స్టార్‌ నుండి మరో ఓటీటీ ప్రాజెక్ట్‌
X
లేడీ సూపర్ స్టార్‌ నయనతార వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పెద్ద ఎత్తున నయన్ సినిమా లకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఓటీటీ ద్వారా భారీ మొత్తం లో ఖర్చు చేసి అయినా విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. గత ఏడాది నయన్‌ అమ్మోరు తల్లి సినిమాను హాట్ స్టార్‌ లో డైరెక్ట్‌ రిలీజ్ చేయడం జరిగింది. ఇక నయన్ నటించిన నేట్రికన్‌ సినిమా ను కూడా ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం అందుతోంది.

తమిళంలో ఈ సినిమా రూపొందింది. మిలింద్ రావు దర్శకత్వంలో ఈ సినిమా ను నయన్‌ తన ప్రియుడు విఘ్నేష్‌ శివన్ తో కలిసి నిర్మించిన విషయం తెల్సిందే. ఈ సినిమా కు కొరియన్‌ మూవీ బ్లైండ్ ప్రేరణ. ఇటీవలే వచ్చిన ప్రమోషనల్ వీడియోస్‌ సినిమా పై అంచనాలు భారీగా పెంచాయి. థియేటర్లు ఓపెన్ అయినా కూడా ప్రేక్షకులు ఎప్పటికి వస్తారో తెలియని పరిస్థితి. ఉంది. దాంతో నేట్రికన్‌ ను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన వార్తలు వస్తున్నాయి.

తమిళ మీడియా సర్కిల్స్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను ప్రముఖ ఓటీటీ పెట్టిన బడ్జెట్‌ కు మించి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందట. థియేటర్ రిలీజ్ కు వెళ్లినా ఆ మొత్తం వచ్చేది కష్టమే. సినిమా సక్సెస్‌ అయితే అప్పుడు లాభాల విషయం. కాని ఇప్పుడు డైరెక్టర్‌ రిలీజ్ చేస్తే సక్సెస్ తో సంబంధం లేకుండానే లాభాలు వస్తున్నాయనే ఉద్దేశ్యంతో మేకర్స్‌ ఉన్నారని తెలుస్తోంది. అందుకే నయన్‌ నేట్రికన్ మూవీని వచ్చే నెలలో డైరెక్ట్‌ ఓటీటీ లో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.