Begin typing your search above and press return to search.

RRR కు మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారం

By:  Tupaki Desk   |   15 Jan 2023 2:30 PM GMT
RRR కు మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారం
X
RRR నుంచి `నాటు నాటు..` సాంగ్ ప్ర‌తిష్ఠాత్మ‌క గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారం ద‌క్కించుకోవ‌డంతో ప్ర‌పంచం దృష్టిని ఆకర్షించింది. ఇక ఇదే హుషారులో RRR ఆస్కార్ కొల్ల‌గొట్టాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. తాజా స‌మాచారం మేర‌కు..ఛెలో షోలో న‌టించిన బాల‌న‌టుడు భవిన్ ని అలాగే RRR బృందాన్ని ఇంటర్నేషనల్ ప్రెస్ అకాడమీ ప్ర‌త్యేకంగా పుర‌స్కారాల‌తో గౌరవించింది.

భవిన్ రాబారి బ్రేక్ త్రూ పెర్ఫార్మెన్స్ అవార్డును గెలుచుకోగా.. SS రాజమౌళి పీరియడ్ ఫిల్మ్ RRR ఇంటర్నేషనల్ ప్రెస్ అకాడమీ గౌరవ శాటిలైట్ అవార్డును అందుకుంది. ఆస్కార్స్ బ‌రిలో ఉన్న‌ ఛెలో షో .. గ్లోబల్ బ్లాక్ బస్టర్ RRR కి ఇలాంటి గౌర‌వం ద‌క్కడంతో ఆస్కార్ ల‌ను గెలిచేందుకు పోటీప‌డుతున్న ఈ చిత్రాల‌పై ప్ర‌జ‌ల్లో మ‌రింత గౌర‌వం పెరిగింది.

ఇంటర్నేషనల్ ప్రెస్ అకాడమీ (IPA) వారాంతంలో సినిమా-టెలివిజన్ రంగంలో 27వ వార్షిక శాటిలైట్ అవార్డుల కోసం స్పెషల్ అఛీవ్ మెంట్స్ అవార్డుల గ్రహీతలను ప్రకటించింది. పాల్ నళిన్ దర్శకత్వం వహించిన ఛెలో షో సౌరాష్ట్రలోని మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే గుజరాతీ చిత్రం. ఇది తొమ్మిదేళ్ల బాలుడి (రబారి) కథను తెర‌పై అందంగా ఆవిష్క‌రించింది. ఆ బాలుడు జీవితాంతం సినిమాని ప్రేమిస్తూనే ఉంటాడు. ఓ థియేట‌ర్ లోకి ప్రవేశించి వేసవికాలం అంతా ప్రొజెక్షన్ బూత్ నుండి సినిమాలు చూస్తూ గడిపేస్తాడు... ఇలాంటి ఆస‌క్తిక‌ర క‌థాంశాన్ని ఉద్విగ్నంగా తెర‌పై ఆవిష్క‌రించ‌డం ద‌ర్శ‌కుని ప్ర‌తిభ‌కు తార్కాణం.

భవిష్యత్తులో తాను త‌న టీమ్ మరిన్ని విజయాలు సాధించి భారతదేశం గర్వపడేలా చేయాలని భావిస్తున్నట్లు రబారీ తెలిపారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.యు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన నళిన్ సర్ - ధీర్ భాయ్ కి ధన్యవాదాలు. మనం భారతదేశాన్ని గర్వించేలా చేయగలమని ఇలాంటి మరెన్నో అవార్డులను గెలుచుకోగలమని ఆస్కార్ ను ఇంటికి తీసుకురాగలమని నేను ఆశిస్తున్నాను అని 13 ఏళ్ల బాల నటుడు ర‌బారీ ఒక ప్రకటనలో తెలిపారు.

భావిన్ కు లభిస్తున్న ప్రేమ ఈ అవార్డు నిజంగా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది చిన్న వయస్సులో ఆ బాలుడి కష్టాన్ని గుర్తించి పుర‌స్కారాలు అందించారు! అని ద‌ర్శ‌కుడు న‌ళిన్ ఆనందం వ్య‌క్తం చేసారు. ఛెలో షోను సిద్ధార్థ్ రాయ్ కపూర్- ధీర్ మొమాయా- నళిన్ - మార్క్ డ్యూలే నిర్మించారు. ఈ చిత్రం USలో శామ్యూల్ గోల్డ్ విన్ ఫిల్మ్స్ .. భారతదేశంలో రాయ్ కపూర్ ఫిల్మ్స్ ద్వారా విడుదలైంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం అంతర్జాతీయ చలనచిత్ర విభాగంలో 95వ అకాడమీ అవార్డుల షార్ట్ లిస్ట్‌లో చోటు సంపాదించింది.

ఎన్టీఆర్ -రామ్ చరణ్ నటించిన RRR నుండి నాటు నాటు సంగీతం (అసలు పాట) విభాగంలో కూడా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో నిలిచింది. ఇరు సినిమాలు ఆస్కార్ లు ద‌క్కించుకోవాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.