Begin typing your search above and press return to search.
కోవిడ్ తో మరో ప్రముఖ దర్శకుడు మృతి
By: Tupaki Desk | 27 April 2021 12:30 PM GMTప్రముఖ దర్శకుడు తమీరా ఈరోజు (ఏప్రిల్ 27 న) కన్నుమూశారు. అశోక్ పిల్లర్-చెన్నైలోని మాయ ఆసుపత్రిలో కోవిడ్ కి చికిత్స పొందుతూ ఆయన మరణించారని తెలుస్తోంది. రెట్టైసుజి- ఆన్ దేవతై వంటి చిత్రాలతో దర్శకుడిగా ఆయనకు గుర్తింపు దక్కింది. 2010లో కె.బాలచందర్- భారతీరాజాలతో `రెట్టసూజి` అనే సినిమాను తెరకెక్కించారు. 2018లో సముతిరఖని- రమ్యపాండియన్ ప్రధాన పాత్రల్లో `ఆన్ దేవతై` సినిమా చేశారు. ఈయన మృత్రి పట్ల డైరెక్టర్ శంకర్ సహా తమిళ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
ఆయన అభిమానులు .. పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖుల్లో స్టార్ డైరెక్టర్ శంకర్ సహా అరుణ్ వైద్యనాథన్- రమ్య పాండియన్ అతడి ఆకస్మిక మరణానికి షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో నివాళి అర్పించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఘిబ్రాన్ అతడిని డబ్బు కోసం పని చేయని దర్శకుడు అంటూ ప్రశంసించారు.
``ఓహ్ మై గాడ్. అతను భారతీరాజా - బాలచందర్ ఇద్దరినీ ఒకే చిత్రంలో దర్శకత్వం వహించాడు. తమీరా సార్ ఆత్మ శాంతించాలి`` అని వైద్యనాథన్ రాశారు. బిగ్ బాస్ ఫేమ్ రమ్య పాండియన్ కూడా ఎమోషనల్ నోట్ రాశారు. కొన్ని ఫోటోలను పంచుకుంటూ-``నేను ఎప్పుడూ తమీరా సార్ స్క్రిప్ట్ రైటింగ్ సామర్ధ్యానికి అభిమానిని. తమిళం పట్ల ఆయనకున్న ప్రేమ అభిరుచి నాతో సహా చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి`` అని వ్యాఖ్యానించారు.
అన్నింటికంటే అతని చుట్టూ ఉండే ప్రతి ఒక్కరితో ప్రవర్తించే విధానం గొప్పది. ఆన్ ధెవాధై తారాగణం సిబ్బంది విషయంలో ఎల్లప్పుడూ చాలా గౌరవంగా వ్యవహరించారు. ప్రతిభను మెచ్చుకోవటానికి అతను ఏమాత్రం సంకోచించరు. ఆయన నన్ను ఆదరించారు. కుటుంబ సభ్యులలో ఒకరిలా నన్ను చూసుకున్నారని రమ్య తెలిపారు. తమీర్ మరణానికి కోలీవుడ్ సంతాపం ప్రకటించింది.