Begin typing your search above and press return to search.

సమంత చెప్పిన మరో ప్రవచనం

By:  Tupaki Desk   |   27 Oct 2021 7:31 AM GMT
సమంత చెప్పిన మరో ప్రవచనం
X
తెలుగు లో ప్రవచనాలు చెప్పేది అంటే ఠక్కున వినిపించే పేర్లు చాగంటి మరియు గరికపాటి. వీరిద్దరు ఎన్నో విషయాల గురించి తమ అభిప్రాయాలను వెళ్లడిస్తూ జనాలను ఎడ్యుకేట్‌ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలో మీరు చేరారా సమంత అంటూ కొందరు సోషల్‌ మీడియా జనాలు ఈమద్య పదే పదే పోస్ట్‌ పెడుతున్నారు. సమంత ప్రవచనాలు అంటూ కొందరు సోషల్‌ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటే మరి కొందరు మరో రకంగా ఆమెను ఈ విషయమై కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఆమె చెప్తున్న విషయాల్లో మ్యాటర్ ఉంది.. మంచి అర్థం మరియు పరమార్థం ఉంది. కనుక ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆమె సూక్తులు సలహాలు పాటించాలి.. అనుకరించాలంటున్నారు. ఇంతకు సమంత చెబుతున్న ఆ విషయాలు ఏంటీ.. ఆమెను ఏకంగా ప్రవచనాలు చెప్పే వ్యక్తిగా నెటిజన్స్ ఎందుకు పేర్కొంటున్నారో చూద్దాం రండీ.

సమంత ఇటీవలే నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లుగా ప్రకటించింది. ఇద్దరు పూర్తిగా ఆలోచించి.. అన్ని పరిణామాల గురించి కూడా చర్చించుకుని తదుపరి విడాకుల నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. ఆ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత సమంత షేర్ చేస్తున్న విషయాలు మరియు ఫొటోలు చర్చనీయాంశం అవుతున్నాయి. మై మామ్‌ సెడ్‌ అంటూ ఆమె షేర్‌ చేస్తున్న కొన్ని కోట్స్ మరియు కొన్ని విషయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సమాజంలో మనిషి మనిషి ఎలా ఉండాలి.. ఒక మనిషి తన సొంత విషయాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అమ్మాయిలు సమాజంలో గౌరవం దక్కించుకునేందుకు చేయాల్సిన విషయాల... అనుసరించాల్సిన పద్దతులు ఇలా ఎన్నో రకాలుగా సమంత ఇన్ స్టా స్టోరీల రూపంలో షేర్‌ చేస్తోంది.

సమంత ఇప్పటికే షేర్‌ చేస్తున్న ఆమె పోస్ట్‌ లతో ప్రవచనాలు చెప్తోంది అంటూ టాక్ తెచ్చుకుంది. అయినా కూడా ఆమె మరో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ ను షేర్‌ చేసింది. ఈసారి అమ్మాయిల తల్లిదండ్రులకు సమంత సలహా ఇచ్చింది. అదేంటీ అంటే.. మీ కూతురు పెళ్లి గురించి కంగారు పడనవసరం లేదు. ఆమెను సమర్థవంతంగా తీర్చిదిద్దండి. ఆమె పెళ్లి కోసం డబ్బులు కూడబెట్టే బదులుగా ఆమె చదువుకు ఆ డబ్బును ఖర్చు చేయండి. ఆమెను పెళ్లికి సిద్దం చేయడానికి బదులుగా ఆమెను ఆమె కోసం సిద్దంగా ఉండేలా చేయండి. ఆమెకు ప్రేమ.. ఆత్మ విశ్వాసం గురించి తెలియజేయండి.

ఇతరులకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మార్గదర్శకంగా ఉండేలా తీర్చిదిద్దండి అంటూ సూచించింది. సమంత సూచించిన ఈ విషయం చాలా మంది తల్లిదండ్రులు పాటించాలి. ఈ సమయంలో అమ్మాయిలకు చదువు అక్కర్లేదు.. పెళ్లి చేసి పంపాలని భావిస్తున్నారు. వారు మారితేనే సమాజం మారుతుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సమంత ను ప్రవచనాలు చెప్తుంది అంటూ ఎక్కిరించినా.. మరేం చేసినా కూడా ఆమె అభిమానులు మాత్రం ఆమె షేర్‌ చేస్తున్న పోస్ట్‌ లను ఖచ్చితంగా పాటించాలని.. జీవితంలో చాలా ముఖ్యమైనవి భావిస్తున్నారు.