Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ కోసం రంగంలోకి మరో సీనియర్ హీరోయిన్!
By: Tupaki Desk | 21 Feb 2022 11:31 AM GMTత్రివిక్రమ్ తన సినిమాల్లో చిన్న చిన్న పాత్రల కోసం కూడా మంచి క్రేజ్ ఉన్న .. మార్కెట్ ఉన్న నటీనటులను తీసుకుంటూ ఉంటారు. అవసరమైతే ఇతర భాషల్లోని సీనియర్ స్టార్స్ ను తీసుకోవడానికి కూడా ఆయన ఎంతమాత్రం వెనకడుగు వేయరు. కథలో హీరో వైపు నుంచి గానీ .. హీరోయిన్ వైవు నుంచి గాని ఆయన ఒక పవర్ఫుల్ లేడీ పాత్రను క్రియేట్ చేస్తుంటారు.
ఆ పాత్రలకి గాను ఆయన ఎక్కువగా సీనియర్ హీరోయిన్స్ ను తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
'అత్తారింటికి దారేది'లో నదియా .. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో స్నేహా .. 'అజ్ఞాతవాసి'లో ఖుష్బూ .. 'అరవింద సమేత'లో దేవయాని .. 'అల వైకుంఠపురంలో' టబు కీలకమైన పాత్రల్లో కనిపించారు. ఆ పాత్రలకి త్రివిక్రమ్ వాళ్లను రంగంలోకి దింపడంలో అర్థం ఉందనే అంతా చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన తాజా చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ శోభనను రంగంలోకి దింపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తాజా చిత్రం మహేశ్ బాబుతో ఉండనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. వచ్చేనెల ఫస్టువీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది.
ఈ సినిమాలో హీరో పిన్ని పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుందట. ఆ పాత్ర చాలా హుందాగా కనిపిస్తూ కథకి ఒక నిండుదనాన్ని తీసుకొచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఈ పాత్రను మంచి క్రేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్ తో చేయిస్తే అది నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందని భావించిన త్రివిక్రమ్, శోభనను సంప్రదించినట్టుగా చెప్పుకుంటున్నారు. తెలుగు సినిమాలకి దూరమై చాలా కాలమైన ఆమెను కొత్తగా తీసుకుని రావడం వలన ఈ సినిమాకి చాలా హెల్ప్ అవుతుందని ఆయన భావించాడట. అందువల్లనే ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు.
నిన్నటి తరం కథానాయికగా శోభనకి తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో మంచి క్రేజ్ ఉంది.
తెలుగుకి సంబంధించి చెప్పుకోవడానికి ఆమె ఖాతాలో మంచి హిట్స్ ఉన్నాయి. 'కోకిల' .. 'అభినందన' .. 'నారీ నారీ నడుమ మురారి' .. ' రౌడీగారి పెళ్ళాం' .. 'రౌడీ అల్లుడు' ఆ జాబితాలో కనిపిస్తాయి. ఇక ఆమె కెరియర్లో 'రుద్రవీణ' ఒక ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తుంది. 1993లో 'రక్షణ' తరువాత మళ్లీ ఆమె మంచు విష్ణు 'గేమ్' సినిమాలో కేరక్టర్ ఆర్టిస్టుగా కనిపించారు. ఆ తరువాత ఇంతకాలానికి మళ్లీ ఇప్పుడు ఈ సినిమాకి ఆమె పేరు వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.