Begin typing your search above and press return to search.
తెరపైకి మరో సంచలన బయోపిక్
By: Tupaki Desk | 17 Jun 2022 9:30 AM GMTఇటీవల కాలంలో బయోపిక్ సినిమాలకు ఏ రేంజ్ లో ఆదరణ దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కువగా స్పూర్తిని ఇచ్చే ఎమోషనల్ రియల్ స్టోరీ లపై దర్శక నిర్మాతలు ఫోకస్ చేస్తున్నారు. ఇక ప్రముఖ నిర్మాణ దిగ్గజం T-సిరీస్ కూడా అదే తరహాలో వరుస బయోపిక్‌లను ప్రకటిస్తోంది. ఇక ఇప్పుడు మరో బయోగ్రాఫికల్ డ్రామాపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించిన ప్రముఖ కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు ఇండియాస్ కాఫీ కింగ్ వీజీ సిద్ధార్థ జీవితంపై త్వరలో సినిమా రూపొందనుందట. సిద్ధార్థ ఆర్థిక నష్టాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
బ్యాక్ లోన్స్ వేల కోట్లకు భారం కావడంతో ఆయన ఆ తరువాత మళ్ళీ నిలదొక్కుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. అతను 29 జూలై 2019న అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తర్వాత సిద్దార్థ మృతదేహం మంగళూరు సమీపంలోని నేత్రావతి నదిలో కనుగొనబడింది. మృతికి కారణం ఆత్మహత్యగా పోలీసులు ప్రకటించారు.
ఇక ఆయన సతీమణి మాళవిక ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా నష్టాల్లో ఉన్న సస్థతోనే మళ్ళీ లాభాలను అందుకొని సగం వరకు అప్పులను తీర్చేశారు. ఇక ప్రముఖ రైటర్స్ రుక్మిణి రావు, ప్రొసెన్‌జిత్ దత్తా రచించిన 'కాఫీ కింగ్ - ది స్విఫ్ట్ రైజ్ అండ్ సడెన్ డెత్ ఆఫ్ కేఫ్ కాఫీ డే ఫౌండర్ విజి సిద్ధార్థ' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.
ఇక ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తూ టి-సిరీస్ ట్వీట్ చేసింది. కర్మ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ అలాగే టి-సిరీస్ ఫిల్మ్స్ భాగస్వామ్యంలో ఆల్మైటీ మోషన్ పిక్చర్ ఎంటర్‌ప్రెన్యూర్ పార్ ఎక్సలెన్స్ వారి ఇండియాస్ కాఫీ కింగ్ విజి సిద్ధార్థ జీవిత చరిత్రకు AV హక్కులను పొందినందుకు ఆనందంగా ఉంది.. అని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు
ప్రస్తుతం దర్శకుడు నటీనటుల విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలోనే మేకర్స్ ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తం నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల గురించి రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక ఎవరికి తెలియని సిద్ధార్థని సినిమాలో చూపించాలని అనుకుంటున్నారు.