Begin typing your search above and press return to search.
రాజ్ కుంద్రాకు మరో షాక్.. మరో నాలుగు రోజులు పోలీస్ కస్టడీలోనే
By: Tupaki Desk | 23 July 2021 10:07 AM GMTబూతు సినిమాల్ని తీస్తున్నారన్న ఆరోపణతో అరెస్టు అయిన వ్యాపారవేత్త..బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముంబయి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తీవ్ర ఆరోపణలతో అరెస్టు అయిన ఆయన్ను.. ఈ నెల 27 వరకు పోలీసుల కస్టడీకి కోర్టు ఓకే చెప్పింది. సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ అగ్రిమెంట్లు చేసుకోవటం.. అనంతరం బూతు సినిమాల్ని బలవంతంగా చేయించటంతో పాటు.. అతడు నిర్వహిస్తున్న యాప్ లోని కంటెంట్ పైనా తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని కోణాల్లో విచారణ చేయాల్సిన అవసరాన్ని కోర్టుకు పోలీసులు తెలిపారు.
దీంతో..రాజ్ కుంద్రాను మరో నాలుగు రోజులపాటు పోలీసుల కస్టడీకి ఓకే చెప్పిన న్యాయస్థానం తాజాగా ఆదేశాల్ని జారీ చేసింది. దీంతో.. ఈ నెల 27 వరకు పోలీసుల కస్టడీలో రాజ్ కుంద్రా ఉండాల్సి ఉంటుంది. పోలీసులకు ప్రాథమికంగా సేకరించిన సమాచారం ప్రకారం.. బూతు సినిమాల నిర్మాణంతో పాటు.. వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో రాజ్ కుంద్రా ఆన్ లైన్ బెట్టింగ్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.
పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రాజ్ కుంద్రా ఆదాయ మార్గాల గురించి ముంబయి పోలీసులు పలు అనుమానాల్ని కోర్టు ముందు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన బ్యాంకు లావాదేవీల్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినట్లుగా సమాచారం. యస్ బ్యాంక్ తో పాటు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న బ్యాంకు ఖాతాల్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపినట్లుగా చెబుతున్నారు.
దీంతో పాటు.. ఆయన నుంచి మరిన్ని వివరాలు సేకరించటానికి కనీసం వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే.. కోర్టు మాత్రం వారికి ఈ నెల 27 వరకు మాత్రం కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజా కస్టడీలో రాజ్ కుంద్రా నుంచి ముంబయి పోలీసులు ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తారు? ఈ ఉదంతంలో మరెన్ని మలుపులు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.