Begin typing your search above and press return to search.
సర్కారు వారికి మరో షాక్: తాజాగా లీకైన మహేష్ ఫోటోలు వైరల్..!
By: Tupaki Desk | 19 Feb 2021 7:58 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకుడు పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ''సర్కారు వారి పాట''. ఇందులో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. GMB ఎంటర్టైన్మెంట్ - 14 రీల్స్ ప్లస్ - మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుపుకుంటోంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ చేజ్ ఎపిసోడ్ ను కూడా చిత్రీకరించారని తెలుస్తోంది. అలానే దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో హీరోహీరోయిన్లపై వచ్చే కీలక సన్నివేశాలను కూడా షూట్ చేస్తున్నారు. అయితే ఈ షూటింగ్ స్పాట్ నుంచి ఎప్పటికప్పుడు వీడియోలు ఫోటోలు లీక్ అవడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారాయని తెలుస్తోంది.
మహేష్ లుక్ చూపించకుండా ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన చిత్ర యూనిట్.. ఇటీవల మహేష్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల ఫోటోలు షూటింగ్ లొకేషన్ నుంచి లీక్ అవడంతో ఖంగు తిన్నారు. ఆ తర్వాత మహేష్ బైక్ పై చేజ్ చేసే సీన్స్ లీక్ అయ్యాయి. ఇవన్నీ ఓ రేంజ్ లో వైరల్ చేసేశారు. ఈ క్రమంలో తాజాగా మహేష్ షూటింగ్ లో పాల్గొన్న కొన్ని ఫోటోలు వీడియో లీక్ అయ్యాయి. ఇందులో మహేష్ వింటేజ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. వీడియోని తొలగించినప్పటికి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మహేష్ అండ్ టీమ్ దుబాయ్ షెడ్యూల్ కి సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వీడియో ఫిబ్రవరి 21న వదులుతారని సమాచారం. కాకపోతే ఆలోపే ఈ సర్కారు వారి లీకులు చిత్ర బృందాన్ని కలవరపెడుతున్నాయి. ఇకపోతే మహేష్ కెరీర్ లో 27వ చిత్రంగా వస్తున్న 'సర్కారు వారి పాట'ను 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు.