Begin typing your search above and press return to search.

మ‌రో ఆరు నెల‌లు థియేట‌ర్స్‌ సీనియ‌ర్స్ వేనా?

By:  Tupaki Desk   |   20 Sep 2022 11:30 PM GMT
మ‌రో ఆరు నెల‌లు థియేట‌ర్స్‌ సీనియ‌ర్స్ వేనా?
X
ఆగ‌స్టు లో రిలీజ్ అయిన నాలుగు సినిమాలు టాలీవుడ్ కు కొత్త ఉత్సాహాన్ని అందించాయి. ఇక ఆ త‌రువాత థియేట‌ర్ల‌లో సంద‌డి చేయాల‌ని చూసిన ఏ సినిమా కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేక ఉసూరుమ‌నిపించాయి. ఇదిలా వుంటే వ‌చ్చే మూడు నుంచి ఆరు నెల‌ల్లో సీనియ‌ర్ ల భ‌డావిడీ థియేట‌ర్ల‌లో క‌నిపించ‌బోతోంది. ఇంత వ‌రకు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌ని సీనియ‌ర్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బాక్సాఫీస్ పై దండ‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు.

నాని, నితిన్‌, వ‌రుణ్ తేజ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, శ‌ర్వానంద్ వంటి టైర్ టు హీరోల సినిమాలు దాదాపు ఆరు నెల‌ల వ‌ర‌కు థియేట‌ర్ల‌లోకి రావ‌డం లేదు. వీరితో పాటు పేరున్న‌ యంగ్ హీరోలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌, నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ర‌వితేజ వంటి సీనియ‌ర్స్ హ‌డావిడీ చేయ‌బోతున్నారు.

ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌, బ‌న్నీ లాంటి స్టార్ హీరోలు త‌మ సినిమాల‌తో వ‌చ్చే ఏడాది వ‌ర‌కు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే అవ‌కాశం లేదు. దీంతో ఆ స‌మ‌యంలో సీనియ‌ర్స్ థియేట‌ర్ల‌లో హంగామాకు రెడీ అవుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌భాస్ `ఆదిపురుష్‌`తో జ‌న‌వ‌రిలో సంద‌డికి రెడీ అయిపోతున్నాడు.. కానీ మ‌హేష్ మాత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కి ఫిక్స్ అయిన విష‌యం తెలిసిందే. మారిన ప్రేక్ష‌కుడి అభిరుచికి అనుగునంగా హీరోలు కూడా త‌మ సినిమాల కోసం కొత్త కొత్త ప్లాన్ లు వేసుకుంటూ ఆ ప్ర‌కార‌మే త‌మ సినిమాల‌తో రంగంలోకి దిగుతుండ‌టంతో తాజా గ్యాప్ ఏర్ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది.

యంగ్ హీరోల్లో చాలా మంది ఇప్ప‌టికే త‌మ త‌మ సినిమాల‌తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేశారు. కొంత మంది హిట్ ల‌ని ద‌క్కించుకోగా మ‌రి కొంత మంది డిజాస్ట‌ర్ల‌ని సొంతం చేసుకుని త‌దుప‌రి సినిమాల‌పై దృష్టిపెట్టారు. అవి థియేట‌ర్ల‌లోకి రావాలంటే క‌నీసం ఆరు నెల‌లైనా ప‌డుతుంది. ఒక్కొ యంగ్ హీరో రెండు మూడు సినిమాల‌తో బిజీగా వున్నాడు. ఇక అఖిల్ `ఏజెంట్‌` ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఇంకా క్లారిటీ లేదు.

ఇక నాగ‌చైత‌న్య బుధ‌వారం నుంచి త‌న కొత్త సినిమాని మొద‌లు పెడుతున్నాడు. అంటే త‌న సినిమా థియేట‌ర్ల‌లోకి రావాలంటే క‌నీసం ఆరు నెల‌లు వెయిట్ చేయాల్సిందే. మెగాస్టార్ ఈ ద‌స‌రాకు `గాడ్ ఫాద‌ర్`తో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాడు. ఆ త‌రువాత బాబీతో చేస్తున్న `వాల్తేరు వీర‌య్య‌` జ‌న‌వ‌రి సంక్రాంతి బ‌రికి రెడీ అవుతోంది. ఇక మ‌రో సీనియ‌ర్ హీరో నాగార్జున `ది ఘోస్ట్‌`తో ఈ ద‌స‌రాకు రెడీ అవుతున్నాడు. బాల‌కృష్ణ కూడా త‌న 107వ ప్రాజెక్ట్ తో డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

ప‌వ‌న్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`తో మార్చిలో రావ‌డానికి సై అంటుంటే రవితేజ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల‌తో రాబోతున్నాడు. వీరి సినిమాల మ‌ధ్య‌లో కొత్త వారి సినిమాలు ఎలానూ వుంటాయి. అయితే కంటెంట్ వున్న సినిమాల‌కై ఇప్ప‌డు ప్రేక్ష‌కుడు ప‌ట్టం క‌డుతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ థియేట‌ర్లు వ‌రుస సినిమాల‌తో మారుమోగే టైమ్ త్వ‌ర‌లోనే రానుంద‌ని సీనియ‌ర్ హీరోల సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తూ క‌ను విందు చేయ‌డం ఖాయ‌మ‌ని ఇన్ సైడ్ టాక్‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.