Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో మరో సౌత్ రీమేక్

By:  Tupaki Desk   |   16 Jan 2023 2:30 PM GMT
బాలీవుడ్ లో మరో సౌత్ రీమేక్
X
తమిళంలో సూపర్ హిట్ అయిన మూవీ డ్రైవింగ్ లైసెన్స్ ని ఇతర భాషలలో కూడా రీమేక్ చేయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయ్ సేతుపతి ఈ సినిమాపై ఆసక్తి చూపించాడు. తెలుగులో రామ్ చరణ్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ మూవీ రీమేక్ పై ఆసక్తి చూపించాడు. అయితే తెలుగులో మాత్రం ఈ మూవీ అఫీషియల్ గా రీమేక్ ఎవరు చేస్తున్నారు అనేది ఎనౌన్స్ చేయలేదు. ఇక హిందీలో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్ లో సెల్ఫీ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.

సౌత్ లో తమిళ్ తెలుగు బైలింగ్వల్ మూవీగా దీనిని రీమేక్ చేసే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఉంటే బాలీవుడ్ ఈ మధ్య కాలంలో గ్యాప్ లేకుండా అందరికంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరో అంటే అక్షయ్ కుమార్ అని చెప్పాలి. గత ఏడాది అక్షయ్ కుమార్ నుంచి ఏకంగా 6 సినిమాలు ప్రేక్షకుల ముందుకి రావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ ఏడాది కూడా అదే స్థాయిలో సినిమాలని అక్షయ్ కుమార్ లైన్ లో పెట్టాడు.

చేతిలో ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే మూడు సినిమాల షూటింగ్ కంప్లీట్ అయిపొయింది. అందులో డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ గా తెరకెక్కిన సెల్ఫీ మూవీ కూడా ఒకటి కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫిబ్రవరి 24న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబందించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అలాగే ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ గ్రూప్ సొంతం చేసుకుంది.

భారీ ధరకి రైట్స్ ని స్టార్ గ్రూప్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఈ మూవీ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడంతో పాటు ప్రమోషన్ పైన కూడా అక్షయ్ కుమార్ దృష్టి పెట్టబోతున్నాడని తెలుస్తుంది. మరి డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ గా తెరకెక్కిన సెల్ఫీ మూవీ హిందీలో ఎ మేరకు హిట్ అవుతుందనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.