Begin typing your search above and press return to search.
టాలీవుడ్ ని మళ్లీ చుట్టేస్తున్న వైరస్
By: Tupaki Desk | 7 Jan 2022 4:30 AM GMTచూస్తుండగానే రెండేళ్ల పాటు కాలహరణం జరిగింది. 2020-2021 బ్యాడ్ సీజన్ ని టాలీవుడ్ అంత తేలిగ్గా మర్చిపోలేదు. కోవిడ్ 19 రంగ ప్రవేశం ఎన్నో పాఠాల్ని నేర్పించింది. కానీ తీరని విషదాల్ని మిగిల్చింది. ప్రముఖులు ప్రతిభావంతులెందరినో హరించింది. కనీసం 2022లో అయినా కోవిడ్ అంతమవుతుంది అనుకుంటే.. ఇప్పుడు ఓమిక్రాన్ అంటూ కొత్త వేరియెంట్ బెంబేలెత్తిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఓమిక్రాన్ మూడో వేవ్ కి సంకేతం అని చెబుతున్నారు. దీంతో జనం మరోసారి అలెర్టయ్యారు. ప్రభుత్వాలు నిబంధనల్ని కఠినతరం చేస్తున్నాయి.
సరిగ్గా సంక్రాంతికి ముందు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో కోవిడ్ భారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అమితాబ్ కుటుంబం.. మెగా కుటుంబం.. కపూర్ కుటుంబం .. ఘట్టమనేని కుటుంబం ఇలా అన్ని కుటుంబాల్లోనూ కోవిడ్ కేసులు కనిపిస్తున్నాయి.
ఇటీవల కమల్ హాసన్ కి కోవిడ్ సోకింది. టాలీవుడ్ లో మంచు మనోజ్ - విశ్వక్ సేన్ కోవిడ్-19 బారిన పడిన సెలబ్రిటీల జాబితాలో చేరారు. వీళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ కి కోవిడ్ పాజిటివ్ అని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి.. అందరూ జాగ్రత్తగా ఉండాలని మహేష్ హెచ్చరించారు. ఇంతలోనే మంచు లక్ష్మికి కరోనా పాజిటివ్ అని తెలిసింది. గురువారం తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని లక్ష్మీ మంచు ప్రకటించారు. రెండేళ్లుగా వైరస్ నుండి దాగుడు మూతలు ఆడుతున్నాం``.. ``చివరకు దానికి చిక్కాను`` అని లక్ష్మి మంచు ప్రకటించారు. వైరస్ తో పోరాడటానికి అవసరమైన జాగ్రత్తల గురించి లక్ష్మీ ఇలా రాసుకొచ్చారు.
``ఇది ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. సాధారణ జలుబు లానే మనందరికీ వస్తుంది. మనం చేయాల్సిందల్లా మన రోగనిరోధక శక్తిని జాగ్రత్తగా చూసుకోవడం.. వైరస్ తో పోరాడటానికి మన శరీరాలు బలంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం. కాబట్టి మీరు విటమిన్లు తీసుకోవడం .. మీ మనస్సు శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం మర్చిపోవద్దు. టీకాలు వేయడం మర్చిపోవద్దు. మీరు రెండుసార్లు టీకాలు వేయించుకున్నట్టయితే మీ కోసం ఉత్తమమైన బూస్టర్ ను ఎంపిక చేసుకోండి`` అని తెలిపారు. కొన్ని మంచి సినిమాలు షోలను సూచించమని తన అనుచరులను కోరుతూ లక్ష్మి నోట్ ను ముగించారు.
సరే ఇప్పుడు నేను చూడడానికి మీ మొదటి మూడు ఇష్టమైన షోలు .. సినిమాలను సూచించండి. కొన్ని పాడ్ క్యాస్ట్ లను కూడా పంపండి! అంటూ అభిమానులను కోరారు. దీనికి రకుల్ వెంటనే స్పందించింది. ``వారసత్వం చూడండి`` అంటూ వ్యాఖ్యను జోడించింది. లక్ష్మీ మంచు అభిమానులు తాను వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈమోజీలను షేర్ చేస్తున్నారు.