Begin typing your search above and press return to search.
తండ్రి కొడుకుల సినిమాలో మరో స్టార్
By: Tupaki Desk | 13 March 2021 5:30 AM GMTతమిళ స్టార్ హీరో విక్రమ్ 60వ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించడం తో పాటు విక్రమ్ తనయుడు ధృవ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. విక్రమ్ మరియు ధృవ్ ల కాంబోలో రాబోతున్న సినిమా అవ్వడంతో తమిళ మరియు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ధృవ్ ఇప్పటికే అర్జున్ రెడ్డి రీమేక్ ఆధిత్య వర్మ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను దక్కించుకున్నాడు. తన తదుపరి సినిమా గా తండ్రి విక్రమ్ తో కలిసి నటించేందుకు సిద్దం అవుతున్నాడు.
తండ్రి కొడుకుల కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయ్యింది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో మరో స్టార్ నటుడు నటించబోతున్నాడు. చిత్ర యూనిట్ సభ్యులు బాబీ సింహాను ఈ సినిమా లో కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ట్యాలెంటెడ్ నటుడిగా పేరు దక్కించుకుని హీరోగా కూడా వరుసగా సినిమా లు చేస్తున్న బాబీ సినిమా విక్రమ్.. ధృవ్ సినిమా లో నటించడంతో సినిమా రేంజ్ మరింతగా పెరగడం ఖాయం అంటున్నారు. ఓ భారీ మల్టీ స్టారర్ గా ఈ సినిమా రూపొందుతుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా అంటే కంటెంట్ విభిన్నంగా ఉంటుందనే ఒక నమ్మకం అందరిలో ఉంటుంది. అందుకే ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే అభిప్రాయం ఇప్పటి నుండే తమిళ ఆడియన్స్ లో ఉంది.