Begin typing your search above and press return to search.
బాలీవుడ్ లోకి 'గబ్బర్ సింగ్' డైరెక్టర్..?
By: Tupaki Desk | 29 Jan 2022 5:30 AM GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా కోసం అభిమానులు గత రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. చివరగా 2019లో 'గద్దలకొండ గణేష్' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన హరీష్.. తదుపరి సినిమా కోసం పవన్ కళ్యాణ్ తో చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు.
ఈ క్రమంలో 'గబ్బర్ సింగ్' దర్శక హీరోల కాంబినేషన్ లో 'భవదీయుడు భగత్ సింగ్' అనే చిత్రానికి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటం.. కరోనా వైరస్ పాండమిక్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది.
హరీష్ శంకర్ ఈ గ్యాప్ ని సద్వినియోగం చేసుకుని పలు ఆసక్తికరమైన స్క్రిప్ట్స్ రెడీ చేసుకున్నారు. ఇప్పటికే 'వేదాంతం రాఘవయ్య' అనే సినిమాకి కథ అందిస్తున్న దర్శకుడు.. ఇటీవల 'ATM' అనే వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేశారు. హరీష్ ఈ సిరీస్ కు స్క్రిప్ట్ అందించడమే కాదు.. దిల్ రాజు మరియు జీ స్టూడియోస్ తో కలిసి నిర్మాణంలో భాగం అవుతున్నారు.
అయితే తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం హరీష్ శంకర్ త్వరలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. అది కూడా తాను డైరెక్ట్ చేసిన 'దువ్వాడ జగన్నాథమ్' (డీజే) హిందీ రీమేక్ తో అని అంటున్నారు.
దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ హీరోగా హరీష్ తెరకెక్కించిన 'డీజే' సినిమా కమర్షియల్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని ఓ బాలీవుడ్ యువ హీరోతో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. దిల్ రాజు ప్రొడక్షన్స్ లోనే ఈ ప్రాజెక్ట్ రూపొందనుందట.
హరీష్ శంకర్ ఇటీవలే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసాడని టాక్. హిందీ ప్రేక్షకుల సెన్సిబిలిటీస్ ని దృష్టిలో పెట్టుకొని వారి అభిరుచికి తగ్గట్లుగా దర్శకుడు స్క్రిప్ట్ లో పలు మార్పులు చేర్పులు చేసాడట. ఇప్పటికే కమిటైన తెలుగు సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈ మూవీ ఉంటుందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటిస్తారని అనుకుంటున్నారు.
ఎంతోమంది టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. ఇటీవల కాలంలో సందీప్ రెడ్డి వంగా - గౌతమ్ తిన్ననూరి - సంకల్ప్ రెడ్డి వంటి పలువురు డైరెక్టర్లు హిందీలో ఎంట్రీ ఇచ్చారు. వివి వినాయక్ కూడా హిందీలో 'ఛత్రపతి' చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. మరి ఈ క్రమంలో హరీష్ శంకర్ కూడా బాలీవుడ్ లో అడుగుపెడతారో లేదో చూడాలి.