Begin typing your search above and press return to search.

ఓటీటీ రిలీజ్ లు ఆగడం లేదు

By:  Tupaki Desk   |   29 Sep 2021 5:30 AM GMT
ఓటీటీ రిలీజ్ లు ఆగడం లేదు
X
బాలీవుడ్ తో పోల్చితే టాలీవుడ్ సినిమాల పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఉత్తరాదిన ఇప్పటి వరకు థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు. ఆమద్య ఒక బాలీవుడ్ స్టార్‌ మూవీ విడుదల అయితే కనీసం పది కోట్ల వసూళ్లు రాలేదు. కాని ఇటీవల నాగచైతన్య నటించిన లవ్‌ స్టోరీ సినిమా మొదటి రెండు రోజుల్లోనే పది కోట్లకు పైగా వసూళ్లు సాధించి 50 కోట్ల వసూళ్ల దిశగా దూసుకు పోతుంది. బాలీవుడ్ లో ఇప్పట్లో పరిస్థితులు కుదుట పడే పరిస్థితి కనిపించడం లేదు. కనుక అక్కడ సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అవ్వడంలో వింత ఏమీ లేదు. అక్కడి మేకర్స్ ఓటీటీ ద్వారా విడుదల చేయడం వల్ల ఎవరికి సమస్య లేదు. కాని టాలీవుడ్‌ లో థియేటర్ లు పూర్తి స్థాయిలో రన్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు చాలా నార్మల్‌ అయ్యాయి. ఇలాంటి సమయంలో సినిమా లు ఓటీటీ లో విడుదల అవ్వడం అంటే ఖచ్చితంగా అది తప్పుడు నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ను థియేటర్ల ద్వారా విడుదల చేసి ఆ తర్వాత మాత్రమే ఓటీటీ లో విడుదల చేయాలని థియేటర్ల యాజమాన్యాలు మరియు బయ్యర్లు విజ్ఞప్తి చేస్తున్నా కూడా కొందరు మాత్రం ఓటీటీకకే మొగ్గు చూపుతున్నారు. ఓటీటీ రిలీజ్ అనేది సేఫ్ గేమ్‌ కనుక ఎక్కువ మంది అటుగా వెళ్తున్నారు.

గత నెల నుండి వరుసగా థియేటర్ల వద్ద సినిమాలు పెద్ద ఎత్తున విడుదల అవుతున్నాయి. మంచి సినిమాలు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.. మ్యాటర్ లేని సినిమాలను జనాలు పట్టించుకోవడం లేదు. ఎప్పటిలాగే పరిస్థితులు నార్మల్‌ అయినా కూడా ఇంకా కొందరు ఓటీటీ విడుదలకు సిద్దం అవ్వడం చర్చనీయాంశంగా మారింది. సప్తగిరి హీరోగా నటించిన గూడుపుఠాణి సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్దం అయ్యింది. ఈ సినిమాలో సప్తగిరి ఒక సీరియస్ హీరోగా ప్రేక్షకులకు కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు హీరోగా నటించినా కూడా తన కామెడీ యాంగిల్ ను కంటిన్యూ చేసిన సప్తగిరి మొదటి సారి పూర్తి సీరియస్ రోల్‌ ను ఈ సినిమాలో చేశాడని.. సినిమా టీజర్ విడుదలతో అర్థం అయ్యింది. సినిమా పై జనాల్లో ఆసక్తి కలిగింది. థియేటర్ల ద్వారా వస్తే ఈ సినిమాకు ఖచ్చితంగా పాజిటివ్‌ బజ్ ఉంటుందని అంతా ఆశించారు. కాని గూడుపుఠాణి సినిమా థియేటర్ రిలీజ్ లేకపోవచ్చు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వారు ఈ సినిమాకు ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసేందుకు సిద్దం అయ్యారట. ప్రస్తుతం నిర్మాతలు మరియు అమెజాన్ వారి మద్య చర్చలు జరుగుతున్నాయని.. అతి త్వరలోనే ఒక ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.

పెట్టుబడి రావడమే కాకుండా లాభాలు కూడా వచ్చేలా ఈ సినిమాను అమెజాన్ కొనుగోలు చేసేందుకు సిద్దం అవుతుంది. కనుక ఖచ్చితంగా అమెజాన్‌ ప్రైమ్ కు ఈ సినిమాను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. గూడుపుఠాని సినిమా విడుదల విషయంలో ఒకటి రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుందేమో చూడాలి. సప్తగిరి హీరోగా నటించిన ఈ సినిమాకు కేఎమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు. సప్తగిరి ఎల్‌ ఎల్‌ బి తర్వాత సప్తగిరికి కమర్షియల్‌ సక్సెస్ దక్కలేదు. కమర్షియల్‌ సక్సెస్ కోసం చకోరా పక్షి తరహాలో సప్తగిరి వెయిట్‌ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది అనేది చూడాలి.