Begin typing your search above and press return to search.
సుశాంత్ సూసైడ్ కేసులో మరో ట్విస్ట్...!
By: Tupaki Desk | 1 Aug 2020 7:51 AM GMTబాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఆయన సూసైడ్ వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా సుశాంత్ ఆత్మహత్య కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. సుశాంత్ కుటుంబ సభ్యులు అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పై ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జులై 25న సుశాంత్ తండ్రి రియా చక్రవర్తితో పాటు పలువురిపై పాట్నా పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. దీంతో బీహార్ పోలీసు బృందం ముంబై చేరుకుని కేసు విచారణ చేపట్టింది. మరోవైపు ఈ కేసును పాట్నా నుంచి ముంబై బదిలీ చేయాలని రియా సుప్రీంకోర్టును అభ్యర్థించింది. సుప్రీంకోర్టుకు రియా సమర్పించిన పిటిషన్ లో తాను సుశాంత్ సింగ్ తో ఏడాదిగా సహజీవనం చేస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో సుశాంత్ తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు చెప్పింది.
కాగా సుశాంత్ మాజీ ప్రేమికురాలు అంకిత లోఖండే వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేశారు. సుశాంత్ కి బాలీవుడ్ లో నెపోటిజం ఉందని తెలిసే అడుగుపెట్టాడు.. సుశాంత్ మరణానికి నెపోటిజం కారణం అయ్యుండదు.. అయినా అతనికి అవకాశాలు బాగానే వచ్చాయని.. ఆదిత్యా చోప్రా, ఏక్తాకపూర్, సంజయ్ లీలా భన్సాలీ లాంటి వారు సుశాంత్ ని ఎంకరేజ్ చేసారని చెప్పుకొచ్చింది. సుశాంత్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండడు.. అతని అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ కాగలడు అని చెప్పింది. అంకిత చెప్పిన దాని ప్రకారం నెపోటిజం లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల డిప్రెషన్ కి గురై ఉండడు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక సుశాంత్ తండ్రి రియాపై కేసు పెట్టిన వెంటనే ''ట్రూత్ విన్స్'' అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది అంకిత. దీనిని బట్టి చూస్తే సుశాంత్ సూసైడ్ వెనుక రియా హ్యాండ్ ఉన్నట్లు అంకిత భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సుశాంత్ అకౌంట్ నుంచి పెద్ద ఎత్తున మనీ డ్రా చేసిందని.. అతన్ని మోసం చేసిందని ఆరోపణలు ఎదుర్కుంటున్న రియా నిన్న ఓ వీడియో రిలీజ్ చేసింది. ''నాకు దేవుడుపై న్యావ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నాకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. ఎలక్ట్రానిక్ మీడియాలో నా గురించి చాలా భయకరంగా చెడు వార్తలు వస్తున్నాయి. ఇది న్యాయపరమైన విషయం కాబట్టి నా లాయర్ సూచన మేరకు నేనేమీ మాట్లాడటం లేదు. సత్యమేవ జయతే. నిజం గెలుస్తుంది'' అని చెప్పుకొచ్చింది. అయితే రియా చక్రవర్తి వెనుక మహేష్ భట్ ఉండి ఇదంతా నడిపిస్తున్నారని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సైతం రియాపై స్పందిస్తూ.. ఆమె తన పని తాను చేసుకుంది కాని ఆమె ఇప్పుడు డిస్పెన్సబుల్ గా మారుతుందని ఆమె గ్రహించలేదు అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా సుశాంత్ ఆత్మహత్య కేసులో మరో కోణం వెలుగుచూసింది. సుశాంత్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఒక పార్టీలో సుశాంత్ ఒకరితో గొడవ పడ్డాడని పుకార్లు వినిపిస్తున్నాయి. సుశాంత్ చనిపోయిన తర్వాత సీసీటీవీ ఫుటేజీ మార్చినట్లు.. ఆ పార్టీలో ఒక మంత్రి కుమారుడు కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సుశాంత్ సింగ్ మరణానికి అసలు కారణమేమిటనే విషయంలో గందరగోళం కొనసాగుతోంది.