Begin typing your search above and press return to search.

నిశ్చితార్థానికి రెడీ అయిన మ‌రో యంగ్ హీరో

By:  Tupaki Desk   |   18 Oct 2021 6:03 AM GMT
నిశ్చితార్థానికి రెడీ అయిన మ‌రో యంగ్ హీరో
X
లాక్ డౌన్ స‌మ‌యంలో ప‌లువురు టాలీవుడ్ హీరోలు స‌హా ఇత‌ర సినీప‌రిశ్ర‌మ‌ల నుంచి స్టార్లు బ్యాచిల‌ర్ షిప్ కి చెక్ పెట్టి పెళ్లితో ఓ ఇంటివాళ్ల‌యిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ కి చెందిన యువ‌హీరో విక్కీ కౌశల్ పెళ్లికి రెడీ అవుతున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత అర్హత కలిగిన బ్యాచిలర్లలో విక్కీ ఒకరు. ఇండ‌స్ట్రీ సెన్సేష‌న‌ల్ హిట్ `యూరి`లో అత‌డు క‌థానాయ‌కుడు. కెరీర్ ప‌రంగా పూర్తి బిజీగా ఉన్నాడు విక్కీ. ప్ర‌స్తుతం అతను కత్రినా కైఫ్ తో డేటింగ్ చేస్తున్నాడు కానీ అధికారికంగా క‌న్ఫామ్ చేయ‌లేదు.

కొంత‌కాలంగా విక్కీ నిశ్చితార్థ పుకార్లు వైరల్ అవుతున్నా కానీ ఎటువంటి అధికారిక నిర్ధారణ లేదు. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో మళ్లీ అడిగినప్పుడు.. విక్కీ త్వరలో తాను నిశ్చితార్థం చేసుకునే ఆలోచనలో ఉన్నానని చెప్పాడు. ప్రియురాలు కత్రినా గురించి ఏమీ చెప్ప‌క‌పోయినా.. త‌న‌ని పెళ్లాడుతున్నాడ‌ని అభిమానులు భావిస్తున్నారు.

విక్కీ కౌశ‌ల్ న‌టిస్తున్న‌ తాజా చిత్రం `సర్దార్ ఉదం`పైనే దృష్టి సారించారు. `సర్దార్ ఉదం` ప్రమోషన్స్ లో కత్రినా- విక్కీ ఇద్దరూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే ఈ జంట ప్రేమ‌లో ప‌డ్డారు. స‌ర్ధార్ ప్ర‌మోష‌న్స్ లో క‌త్రిన‌ను విక్కీ హ‌గ్ చేసుకున్న ఓ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.