Begin typing your search above and press return to search.
అక్కినేనితో సుశాంత్ పోలికా ఆశ్చర్యమే కానీ?
By: Tupaki Desk | 15 Jun 2020 8:30 AM GMTఅక్కినేని అందగాడు ఏఎన్నార్ తో బాలీవుడ్ యువహీరో సుశాంత్ పోలికా..? అదెట్టా..! అంటే ఒకసారి `మనం` జ్ఞాపకాల్ని తిరగతోడాల్సిందే. ఆ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో ఏఎన్నార్ ఇచ్చిన అద్భుత ఎక్స్ ప్రెషన్స్ అభిమానుల కళ్ల ముందు ఎప్పటికీ మెదులుతూనే ఉంటాయి. అసలు ఆయన తన ఏజ్ గురించి ఎంత మాత్రం చింత లేకుండా ఎంతో ఎనర్జిటిక్ గా నటించారు.
అప్పటికే ఆయనకు అనారోగ్యం ఉంది. నీరసించిపోయారు. క్యాన్సర్ ఉందని డాక్టర్లు చెప్పేశాక కూడా ఆయన మనం చిత్రంలో నటించారు. చివరి సన్నివేశం వరకూ.. ఆయన ముఖంలో చిరునవ్వు చెరగలేదు. నేరుగా మీడియాని అన్నపూర్ణ స్టూడియోస్ కి పిలిచి `నాకు క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పారు.. ఇంకెంతో కాలం బతకను!! అంటూ ఎంతో ధైర్యంగా చెప్పి అందరికీ షాకిచ్చారు. అది ఆయన ధీరత్వం... తెగువ..!!
ఆ తర్వాత మనం సినిమా చూసినవాళ్లకు ఆయన అన్న మాటలు పదే పదే జ్ఞప్తికి వచ్చాయి. ఒక సీన్ లో ఏఎన్నార్ కార్ లోంచి అద్దం మీదికి వొంగి బయటకు తథేకంగా చూస్తూ నవ్వుతున్న దృశ్యం ఆశ్చర్యపరుస్తుంది. ఆ చూపులో ఏదో అర్థం ధ్వనిస్తుంది. అయితే ఇటీవల సుశాంత్ నటించిన `చిచ్చోరే`లోనూ అలాంటి దృశ్యం ఉంది. సుశాంత్ తనలో తానే నవ్వుకుంటూ కార్ అద్దంలోంచి బయటికి చూస్తాడు.. ఆకాశం వైపు చూస్తాడు. అవన్నీ యాథృచ్ఛికమే అయినా కానీ.. ఇదేదో మహత్తు లాంటిదేనని గమ్మత్తయిన విషయమేనని అభిమానులు భావిస్తున్నారు.
సుశాంత్ కార్ లోంచి బయటికి తొంగి చూస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉండే సన్నివేశానికి అంతకుముందు ఇర్ఫాన్ ఖాన్ .. హాలీవుడ్ నటుడు హీత్ (డార్క్ నైట్ ఫేం జోకర్ పాత్రధారి) కార్ లోంచి బయటికి చూస్తూ అంతర్మథనానికి గురయ్యే సన్నివేశాన్ని పోల్చి చూస్తున్నారు. మరణాలకు ముందు చివరి సినిమాలో రేర్ మూవ్ మెంట్ కాబట్టే అంత ఆసక్తి. ఆ క్రమంలోనే ఎన్నార్ తో సుశాంత్ పోలిక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏఎన్నార్ మరణానికి ముందు చివరి సినిమా మనంలో అరుదైన ఆ దృశ్యానికి సుశాంత్ మరణానికి ముందు సినిమాలో అరుదైన దృశ్యానికి ముడి వేయడం సరికాదు కానీ.. కాస్త వింతైన పోలిక అనడంలో సందేహమేం లేదు.