Begin typing your search above and press return to search.
మరీ ఇలాంటి వసూళ్లను ఊహించలేదు
By: Tupaki Desk | 4 Jan 2019 1:30 AM GMTఘాజీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, మంచి వసూళ్లను దక్కించుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి మలి ప్రయత్నంగా తెరకెక్కించిన ‘అంతరిక్షం’ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్లుగా చాలా విభిన్నంగా, వైవిధ్యభరితమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. ఖచ్చితంగా ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ను రాబడుతుందని అంతా భావించారు. కాని ‘అంతరిక్షం’ కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నాయి.
‘ఫిదా’ - ‘తొలిప్రేమ’ చిత్రాలు మంచి వసూళ్లను దక్కించుకున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ కూడా పాతిక కోట్లకు తగ్గకుండా వసూళ్లను రాబట్టడం ఖాయం అంటూ ట్రేడ్ పండితులు కూడా నమ్మకం పెట్టుకున్నారు. కాని టాక్ నెగటివ్ గా రావడంతో కలెక్షన్స్ తారు మారు అయ్యాయి. ఆశించిన వసూళ్లలో కనీసం 30 శాతం వసూళ్లు కూడా రాలేదంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుని పెద్ద మొత్తాలకు కొనుగోలు చేశారు. క్రిష్ నిర్మాత అవ్వడంతో తప్పకుండా సినిమాలో మ్యాటర్ ఉంటుందని ఆశించారు. తీరా సినిమా నిరాశ పర్చడంతో మినిమం కలెక్షన్స్ కూడా రాలేదు. సినిమాకు మంచి హైప్ వచ్చినా కూడా ఓపెనింగ్స్ రాకపోవడం సినీ వర్గాల వారికి కూడా ఆశ్చర్యంను కలిగిస్తుంది. వరుణ్ స్టామినా మరీ ఇంత తక్కువనా అంటూ బాక్సాఫీస్ పరిశీలకులు పెదవి విరుస్తున్నారు.