Begin typing your search above and press return to search.
క్రిష్ కు అంతరిక్షం షాకు
By: Tupaki Desk | 25 Dec 2018 5:54 AM GMTడిసెంబర్ 21 న రిలీజ్ అయిన నాలుగైదు చిత్రాలలో సంకల్ప్ రెడ్డి - వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పేస్ థ్రిల్లర్ 'అంతరిక్షం' ఒకటి. ఈ సినిమాపై రిలీజ్ కు ముందు పాజిటివ్ బజ్ ఉంది కానీ రిలీజ్ తర్వాత మాత్రం రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. సినిమా జోనర్ కొత్తదే అయినా.. ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా కథనం లేకపోవడం.. మరీ టెక్నికల్ గా అనిపించడంతో తోలి రోజునే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మొదటి వారాంతం వసూళ్ళు నామమాత్రంగానే ఉన్నాయి.
ఈ సినిమాను సాయిబాబా జాగర్లమూడి- రాజీవ్ రెడ్డి- క్రిష్ జాగర్లమూడి కలిసి దాదాపు రూ. 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. హీరో వరుణ్ తేజ్ మార్కెట్ ప్రకారం ఇది కాస్త ఎక్కువ బడ్జెట్టే. స్పేస్ థ్రిల్లర్ కావడంతో అది ఇంకా పెద్ద రిస్క్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీలో రిలీజ్ చేయడం తో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కొన్ని ఏరియాల్లో రిలీజ్ చేసేందుకు ముందు రాలేదు. దీంతో నిర్మాతలే సినిమా మీద నమ్మకంతో ఓన్ రిలీజుకు వెళ్ళారు. కానీ మొదటి వీకెండ్ లో ఈ సినిమా జస్ట్ 4.5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఈ లెక్కన ఫుల్ రన్ లో 10 కోట్లు దాటడం కష్టమేనని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు.
ఒకవేళ డిజిటల్.. శాటిలైట్ రైట్స్ 5 నుండి 6 కోట్లు వస్తాయనుకున్నా థియేట్రికల్ బిజినెస్ ద్వారా మాత్రం సగానికి సగం నష్టం తప్పేలా లేదు. అంటే దర్శకుడు క్రిష్ కు నిర్మాతగా నష్టాలు తప్పవు. క్రిష్ గతంలో తను దర్శకత్వం వహించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినా ఎప్పుడూ పెద్దగా నష్టపోలేదు. ఈసారి మరో డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ని నమ్మి నష్టాల బాటలో పయనించడం చిత్రమే.