Begin typing your search above and press return to search.

అమెరికాలో సుందరం సందడి.. $1M మార్క్ దిశగా పరుగులు..!

By:  Tupaki Desk   |   13 Jun 2022 7:30 AM GMT
అమెరికాలో సుందరం సందడి.. $1M మార్క్ దిశగా పరుగులు..!
X
నేచురల్ స్టార్ నాని మరియు నజ్రియా నజీమ్ జంటగా నటించిన ''అంటే సుందరానికి'' సినిమా ఫస్ట్ వీకెండ్ ను పూర్తి చేసుకుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ శుక్రవారం (జూన్ 10) థియేటర్లలోకి వచ్చింది.

భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా.. తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. కాకపోతే ఓవర్ సీన్ లో మాత్రం నాని సినిమా మంచి వసూళ్ళు రాబడుతోంది.

యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద 'అంటే సుందరానికి' సినిమా మిలియన్ మార్క్ దిశగా ముందుకు సాగుతోంది. ట్రేడ్ వర్గాల తాజా లెక్కల ప్రకారం.. ఈ సినిమా అమెరికాలో ఇప్పటి వరకు $ 800K పైగా కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది.

ట్రెండ్ ఇలానే కొనసాగితే ఈ సినిమా మరికొన్ని రోజుల్లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరే అవకాశం ఉంది. ఇదే జరిగితే నాని కెరీర్ లో యుఎస్ లో 1 మిలియన్ మార్క్ అందుకున్న 7వ సినిమాగా 'అంటే సుందరానికి' నిలుస్తుంది.

తెలుగు రాష్ట్రాలలో మాత్రం 'అంటే.. సుందరానికి' సినిమా బాక్సాఫీస్ ప్రయాణం నిరాశజనకంగానే సాగుతోంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి రూ. 10.40 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఫస్ట్ డే రూ. 3.87 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. శనివారం 3.48 కోట్లు - ఆదివారం రూ. 3.05 కోట్లు వసూలు చేసినట్లు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో నాని కెరీర్ లో తక్కువ ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టిన సినిమా ఇదేనని చెప్పాలి.

'అంటే సుందరానికి' చిత్రాన్ని తెలుగుతో పాటుగా తమిళ్ మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఇందులో సీనియర్ నరేష్ - రోహిణి - శ్రీకాంత్ అయ్యంగార్ -అజుగల్ పెర్మ్యూల్ - నదియా - హర్ష వర్ధన్ - రాహుల్ రామకృష్ణ - సుహాస్ - పృథ్వీరాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

సినిమాలో నాని - నజ్రియా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. కాకపోతే స్లో నేరేషన్ - నిడివి అనేవి ఈ చిత్రానికి ప్రతికూలంగా మారాయి. మొదటి వారాంతం వసూళ్ళు చూస్తే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోడానికి రాబోయే రోజుల్లో స్ట్రాంగ్ గా నిలబడాల్సి ఉంది.

'అంటే సుందరానికి' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని - యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చగా.. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.