Begin typing your search above and press return to search.
అంటే.. కాస్త ముందుగానే ఓటీటీలోకి రాబోతోందా..??
By: Tupaki Desk | 23 Jun 2022 5:32 AM GMTఓటీటీల హవా మొదలైన తర్వాత థియేట్రికల్ రిలీజ్ కాబడిన ఏ సినిమా అయినా నెల తిరక్కుండానే డిజిటల్ స్క్రీన్ మీదకు వచ్చేస్తున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు - స్టార్ హీరోల చిత్రాలు కూడా మూడు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబడ్డాయి. థియేట్రికల్ రన్ పూర్తవ్వకుండానే డిజిటల్ రిలీజ్ అవుతుండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
పాండమిక్ టైంలో ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలు.. థియేటర్లకు రావడం తగ్గించేశారనేది స్పష్టంగా అర్థం అవుతోంది. ఎలాగూ కొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి వస్తాయి కదా.. అప్పుడు చూడొచ్చనే ధోరణిలో ఉంటున్నారు. ఇది కలెక్షన్స్ పై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది.
అందుకే నిర్మాతలు ఓటీటీ రిలీజ్ విషయంలో జాగ్రత్త పడుతున్నారు. డీల్ కుదిరినా బయటకు రానీయకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడప్పుడే ఓటీటీలోకి రాదంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఒకవేళ సోషల్ మీడియాలో డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ప్రచారం జరిగినా.. అబ్బే అలాంటిందేం లేదంటూ కొట్టిపారేస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని నటించిన 'అంటే.. సుందరానికి' సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాబట్టలేకపోయింది. దీంతో అప్పుడే ఓటీటీ రిలీజ్ గురించి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
నాని చిత్రాన్ని ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నట్లు టాక్. జులై 1న ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే దీనిపై మేకర్స్ స్పందిస్తూ.. అవన్నీ నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. అంత త్వరగా సినిమా ఓటీటీలోకి రాదని చెప్పారు.
అయితే ఇప్పుడు 'అంటే సుందరానికీ' చిత్రాన్ని జులై 8న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతకంటే ముందే వచ్చే అవకాశం కూడా ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. అంటే జూలై ఫస్ట్ వీక్ లోనే నాని సినిమా డిజిటల్ స్క్రీన్ పైకి వచ్చేస్తుందన్నమాట. ఇప్పటికైతే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మరి నాని సినిమా జులై 1న ఓటీటీలోకి వస్తుందా లేదా జులై 8న రాబోతోందా అనే విషయం పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ రెండు తేదీల్లో ఎప్పుడొచ్చినా నెల తిరక్కుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అయినట్లే అవుతుంది.
'పుష్ప: ది రైజ్' 'భీమ్లా నాయక్' 'రాధే శ్యామ్' 'ఆచార్య' 'సర్కారు వారి పాట' వంటి తెలుగు సినిమాలు మూడు లేదా నాలుగు వారాల్లో ఓటీటీలోకి వచ్చాయి. ఈ క్రమంలో 'అంటే సుందరానికి' మూవీ కూడా ఎర్లీగా స్ట్రీమింగ్ అవుతుందో లేదో చూడాలి.
'అంటే సుందరానికి' చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఇందులో నాని సరసన నజ్రియా నజీమ్ ఫాహాద్ హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు.