Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న 'అంటే.. సుందరానికీ!'
By: Tupaki Desk | 2 Jun 2022 1:25 PM GMTనేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ''అంటే.. సుందరానికీ!". వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇందులో నాని సరసన నజ్రియా నజీమ్ ఫహాద్ హీరోయిన్ గా నటించింది. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఇప్పటికే 'అంటే సుందరానికీ' సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది. చాలా రోజుల తర్వాత నాని మళ్లీ నవ్వించే పాత్రలో కనిపిస్తుండటంతో.. సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.
అమెరికాకు వెళ్లాలని కలలు కనే అమాయకపు బ్రాహ్మణుడు సుందర్ ప్రసాద్ గా నాని కనిపించగా.. క్రిస్టియన్ యువతి లీలా థామస్ గా నజ్రియా నజీమ్ నటించింది. సుందర్ మరియు లీలా మధ్య విలక్షణమైన ప్రేమకథకు ఇందులో చూపించారు.
సుందర్ మరియు లీల ఇద్దరి ప్రపంచాలు మరియు వారి కుటుంబాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. నానికి కలను సాకారం చేసుకోడానికి అతని కుటుంబం కాకుండా మరొక అడ్డంకి ఉంది. ఏడు మహాసముద్రాలను దాటి యూఏస్ఏలో దిగాలనే సుందర్ కోరికకు కుటుంబం వ్యతిరేకం అయితే.. లీలాకు కూడా ఒక స్వంత కల ఉంది.
టీజర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. ఈ ట్రైలర్ మరింత వినోదాన్ని పంచుతూ అంచనాలు రెట్టింపు చేస్తోంది. వివేక్ ఆత్రేయ మార్క్ ఫన్ మరియు రొమాంటిక్ ట్రాక్ కూడా ఆకర్షణీయంగా ఉంది. నాని మరియు నజ్రియా ఇద్దరూ తమ పాత్రలను అద్భుతంగా పోషించారు.
ముఖ్యంగా నాని యంగ్ లుక్ లో బ్రాహ్మణుడిలా మారిన విధానం ప్రశంసనీయం. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ మరియు వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ గా ఉన్నాయి. దీనికి రవితేజ గిరిజాల ఎడిటర్ గా వర్క్ చేయగా.. లతా నాయుడు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
నవీన్ యెర్నేని - యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో నరేష్ - రోహిణి - శ్రీకాంత్ అయ్యంగార్ - నదియా - హర్ష వర్ధన్ - రాహుల్ రామకృష్ణ - సుహాస్ - పృథ్వీరాజ్ తదితరులు తమ పాత్రలను సమర్ధవంతంగా పోషించారు.
'అంటే సుందరానికీ' సినిమాని 2022 జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా మూడు దక్షిణాది భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. తమిళ్ లో 'అడాడే.. సుందరా'.. మలయాళంలో 'ఆహా.. సుందరా' అనే పేర్లతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.