Begin typing your search above and press return to search.
'అంటే... సుందరానికీ!' అంత పలుకుతోందా..?
By: Tupaki Desk | 17 Dec 2020 4:35 PM GMTజీ గ్రూప్ వారు తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ జీ స్టూడియోస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాలా థియేట్రికల్ రిలీజ్ చేయాలా అని ఇన్నాళ్లూ ఆలోచించిన జీ గ్రూప్ వారు చివరకు థియేటర్ లో విడుదల చేయడానికే మొగ్గు చూపారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'అంటే... సుందరానికీ!' సినిమా రైట్స్ తీసుకోడానికి జీ గ్రూప్ వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
'అంటే... సుందరానికీ!' అంటూ టైటిల్ తోనే ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిని కలిగించారు మేకర్స్. 'బ్రోచేవారేవరురా' 'మెంటల్ మదిలో' చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - యలమంచిలి రవిశంకర్ నిర్మించనున్నారు. ఇందులో మలయాళ బ్యూటీ నజ్రియా ఫాహద్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవకముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన నాని సినిమా కోసం జీ గ్రూప్ వారు భారీ ఆఫర్ ఇస్తున్నారట. థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి సుమారు 55 కోట్లు వరకు ఆఫర్ చేస్తున్నారట. దీంట్లో నిజమెంతో తీయాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.