Begin typing your search above and press return to search.
హీరో - నిర్మాత మధ్య ఆర్థిక తగదాలు
By: Tupaki Desk | 4 Sep 2018 7:50 AM GMTసతీష్ జై - రేష్మి గౌతమ్ జంటగా పోయిన వారం బాక్సాఫీస్ వద్ద ‘అంతకుమించి’ అనే మూవీ విడుదలైన సంగతి తెలిసిందే.. ఈ సినిమా విడుదల కాకుండా నిర్మాత గౌరీకృష్ణ ప్రసాద్ కోర్టు కెక్కడం .. పోలీసుల గడుప తొక్కడం సంచలనమైంది. హీరో సతీష్ జైకు - నిర్మాత గౌరీకృష్ణకు మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలే సినిమా విడుదల - ప్రమోషన్ విషయంలో నష్టం తెచ్చాయని సమాచారం.
శ్రీకృష్ణా క్రియేషన్స్ బ్యానర్ అధినేత - నిర్మాత గౌరీకృష్ణ ప్రసాద్ వెర్షన్ ప్రకారం ... ‘అంతకుమించి’ సినిమాను తాను రిజిస్ట్రర్ చేయించానని.. సినిమాను మొదలు పెట్టిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే వదిలేశానని తెలిపారు.. దీంతో కమలాపురి కాలనీకి చెందిన సతీష్ జై తనే హీరో - నిర్మాతగా ఈ సినిమాను పూర్తి చేయడానికి ముందుకు వచ్చాడని వివరించాడు. సినిమాకు 50 లక్షల వరకూ పెట్టుబడి పెట్టానని.. ఆ డబ్బులు ఇవ్వాలని సతీష్ జైను కోరగా సినిమా పూర్తయ్యాక ఇస్తాననన్నాడని వివరించాడు. సినిమా పూర్తి అయ్యి విడుదలకు సిద్ధమైనా సతీష్ ఇవ్వకపోవడంతో తాను కోర్టును ఆశ్రయించానని తెలిపారు. కోర్టు సెప్టెంబర్ 4వ వరకూ స్టే ఇచ్చిందని... అయినా ఆగకుండా సతీష్ జై గత వారం ‘అంతకుమించి’ మూవీని రిలీజ్ చేశాడని నిర్మాత గౌరీకృష్ణ తెలిపాడు.. దీంతో హీరో సతీష్ పై కోర్టుధిక్కరణతో పాటు చీటింగ్ - క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నిర్మాత గౌరీకృష్ణ తెలిపారు.
ఈ కేసు నడుస్తుండగానే తాజాగా హీరో సతీష్ జై... నిర్మాత గౌరీకృష్ణ పై కేసు పెట్టాడు. తన సంతకంతో పాటు క్యాషియర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించాడని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘అంతకుమించి’ సినిమాకు గౌరీకృష్ణ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని.. తానే 2.5 కోట్లు ఖర్చు చేసి సినిమా తీసినట్లు హీరో సతీష్ జై తెలిపాడు. తాను 50 లక్షలు ఎగ్గొట్టానంటూ మీడియా, పత్రికల్లో తప్పుదోవ పట్టిస్తున్న గౌరీకృష్ణపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇలా సినిమా పెట్టుబడి విషయంలో హీరో, నిర్మాత మధ్య పరస్పర ఆరోపణలు చివరకు కేసులు - కోర్టుల వరకూ వెళ్లాయి..