Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: ‘అంతం’
By: Tupaki Desk | 7 July 2016 12:01 PM GMTచిత్రం : ‘అంతం’
నటీనటులు: రష్మి గౌతమ్ - చరణ్ దీప్ - వాసుదేవ్ - సుదర్శన్ తదితరులు
సంగీతం: కార్తిక్ రోడ్రిగ్జ్
ఛాయాగ్రహణం - కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - నిర్మాణం: జి.ఎస్.ఎస్.పి. కళ్యాణ్
రష్మి గౌతమ్ అందచందాలే ప్రధాన ఆకర్షణగా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన సినిమా ‘అంతం’. కొత్త దర్శకుడు జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్ రూపొందించిన ఈ థ్రిల్లర్ మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
కళ్యాణ్ కృష్ణ (చరణ్ దీప్) హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అతడి భార్య వనిత (రష్మి గౌతమ్) కూడా జాబ్ చేస్తుంటుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఓపక్క ఉద్యోగాలు చేసుకుంటూ.. ఇంకో పక్క వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూ హ్యాపీగా గడిపేస్తున్న ఈ జంటకు ఓ రోజు విచిత్రమైన అనుభవం ఎదురవుతుంది. కళ్యాణ్ విజయవాడ నుంచి వస్తున్న సమయంలో హైదరాబాద్ లో వాళ్ల ఫ్లాట్ నుంచి వనితను కిడ్నాప్ చేస్తారు. తాము చెప్పినట్లు చేయకపోతే వనితను చంపేస్తామని కళ్యాణ్ కు ఫోన్ చేసి బెదిరిస్తాడు కిడ్నాపర్. ఇంతకీ అతను కళ్యాణ్ కు చెప్పిన పనేంటి..? ఆ పని అతను పూర్తి చేశాడా..? చివరికి వనిత కిడ్నాపర్ల చెర నుంచి బయటపడిందా లేదా..? అన్నది తెర మీదే చూడాలి.
కథనం - విశ్లేషణ:
‘పోకిరి’ సినిమాలో చివర్లో ట్విస్టు రివీల్ అయ్యాక ఒకసారి వెనక్కి వెళ్లి ఆలోచిస్తే.. అంతకుముందు మహేష్ బాబు-నాజర్ మధ్య వచ్చిన సన్నివేశాలు నాన్సెన్స్ లాగా అనిపిస్తాయి. ఆ సన్నివేశాలన్నీ ఒకరకంగా ప్రేక్షకుల్ని ఫూల్ చేసేవే. ఐతే అందులో ట్విస్టు అద్భుతంగా పేలడం వల్ల.. మిగతా ఆకర్షణలూ ఉండటం వల్ల.. ప్రేక్షకుడు దాని గురించి అసలు ఆలోచించనే ఆలోచించడు. ప్రేక్షకులకు ఓ ట్విస్టు ఇవ్వాలనుకున్నపుడు అది కన్విన్సింగా అయినా ఉండాలి.. లేదా దాని గురించి ప్రేక్షకుడు ఆలోచించాల్సిన అవసరం లేకుండా అయినా చేయాలి. ఐతే ‘అంతం’ సినిమాలోని ట్విస్టు ఈ రెండు కేటగిరీల్లోకీ రాదు. చాలా సిల్లీగా అనిపిస్తుంది. థ్రిల్లర్ సినిమాను కాస్తా కామెడీగా మార్చేసే ట్విస్టు అది. ఈ ట్విస్టు సంగతి వదిలేసి మిగతా అంశాల్లోకి వెళ్దాం.
‘అంతం’ సినిమా పైన జనాలకు అంతో ఇంతో ఆసక్తి కలిగిందంటే అందుక్కారణం ట్రైలర్లో రష్మి అందాల ప్రదర్శనే. రష్మి మీదే ఆశలు పెట్టుకునేట్లయితే.. కరెక్ట్ టైంకి థియేటర్లోకి అడుగుపెట్టండి. ఓ పావు గంట ఆలస్యమైతే టికెట్ డబ్బులు వృథా అయినట్లే. ఈ వేళలో నీవు అంటూ.. కుర్రాళ్లను తొలి పాటలో బాగానే అలరిస్తుంది రష్మి. ఆ పావు గంట గడిచాక ఇక రష్మి సినిమాలో ఉన్నా లేనట్లే అన్నమాట. నేరుగా కుర్రాళ్లకు ఇవ్వాల్సిన డోస్ ఇచ్చేసి.. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్తాడు దర్శకుడు. అక్కడి నుంచే మొదలవుతుంది ప్రేక్షకుడికి అసలు సవాల్.
హీరో భార్యను కిడ్నాప్ చేసిన విలన్.. తాను చెప్పినట్లు చేయమని హీరోకు ఫోన్లో ఆదేశాలిస్తూ ఉంటాడు. దర్శకుడు అత్యంత సహజంగా సినిమాను తీర్చిదిద్దే క్రమంలో.. ఎంతగా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాడో ఓ ఉదాహరణ చెప్పుకుందాం. ఓ సీన్లో విలన్ ఓ దాబా దగ్గర ఆగి.. దాన్ని ఫొటో తీసి.. ఫ్రెషప్ అయ్యి అక్కడో వ్యక్తిని కలవమంటాడు. ఇక హీరోగారు అక్కడ దిగడం.. రకరకాల యాంగిల్స్ లో దాబాను ఫొటో తీయడం.. వాటర్ బాటిల్ తీసుకోవడం.. మొహం కడగడం.. తర్వాత ముఖం తుడుచుకోవడం.. టీ తాగడం.. ఇలా అన్నీ కూడా రియల్ టైంలో జరుగుతున్నట్లుగా తెరమీద వ్యవహారం నెమ్మదిగా నడుస్తుంటుంది. ఓ చోట రెండు నిమిషాలు వెయిట్ చేయమంటే.. హీరోతో పాటు మనం కూడా ఆ వెయిటింగ్ పీరియడ్ ను అనుభవించాల్సి ఉంటుందన్నమాట. మరో సీన్లో వెళ్లి కాళ్లూ చేతులు కడుక్కుని రా అని హీరోకు ఆదేశాలు అందితే.. అతనెళ్లి ట్యాప్ ఓపెన్ చేసి.. కాళ్లూ చేతులు కడుక్కుని తీరిగ్గా ముఖం తుడుచుకోవడం కూడా చూపిస్తారు. ఇలా ఏ విషయం లేకుండా రియల్ టైంలో నడుస్తున్నట్లు.. నెమ్మదిగా.. తాపీగా సా...గిపోతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే సన్నివేశాలు ‘అంతం’లో బోలెడున్నాయి.
ఓ చోటి నుంచి మరో చోటికి పది నిమిషాల్లో రమ్మంటే.. కేవలం ఆ ప్రయాణాన్ని చూపిస్తూ కూడా కొన్ని నిమిషాల సమయాన్ని కరిగిద్దామని చూడటం విడ్డూరం. ఏదో జరిగిపోతున్నట్లు కెమెరాతో.. నేపథ్య సంగీతంతో చాలా బిల్డప్పే ఇచ్చారు కానీ.. తెర మీద మాత్రం ఏమీ జరగదు. థ్రిల్లర్ సినిమాలకు ప్రధానమైన విషయం వేగం.. ఉత్కంఠ. కానీ ఇందులోని సన్నివేశాలు నత్తనడకన సాగుతూ విసుగు పుట్టిస్తాయి. ప్రతి సన్నివేశం కూడా ఇంకెప్పుడు ముగుస్తుందో అన్న ఫీలింగ్ కలిగిస్తుంది.
విజయవాడ నుంచి హీరో హైదరాబాద్ చేరుకునే సరికి.. నిజంగా మనం కూడా అక్కడి నుంచి హైదరాబాద్ కు ట్రావెల్ చేసి వచ్చిన ఫీలింగ్ లో ఉంటాం. ఇక మొదట్లో ఓ పాటలో మెరిసి మాయమైపోయిన రష్మి.. చివర్లో తనలోని మరో యాంగిల్ చూపిస్తూ రెచ్చిపోయే సన్నివేశం చూస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవడం అంటారే.. అలాంటిదే జరుగుతుంది. ఈ ట్విస్టు గురించి చెబితే.. సస్పెన్స్ (?) రివీలైపోతుంది కాబట్టి ఇక్కడ దాని గురించి మాట్లాడట్లేదు. దర్శకుడి ‘రియలిస్టిక్’ అప్రోచ్ పుణ్యమా అని.. ‘అంతం’ నిడివి రెండు గంటలే అయినా.. రెండు మూడు సినిమాలు చూసిన భావనతో బయటపడతాడు ప్రేక్షకుడు. సుదర్శన్ పాత్రతో కామెడీ చేయించడానికి ఏదో ప్రయత్నం జరిగింది కానీ.. అది కూడా పెద్దగా ఫలితాన్నివ్వలేదు.
నటీనటులు:
రష్మి నుంచి ఏం ఆశిస్తారో.. అది ఓ పాట ద్వారా బాగానే ఇచ్చేస్తుంది. ఇక ఆమె పెర్ఫామెన్స్ గురించి చెప్పడానికేమీ లేదు. సినిమా అంతా కలిపితే ఆమె ఓ 20 నిమిషాలు కనిపిస్తే ఎక్కువ. చరణ్ దీప్ మంచి నటుడే కానీ.. ఇందులో మాత్రం క్లూ లెస్ గా కనిపించాడు. ఓ సన్నివేశంలో అవసరానికి మించి ఆవేశపడతాడు. ఇంకో సన్నివేశంలో మరీ కూల్ గా కనిపిస్తాడు. తానున్న పరిస్థితుల్లో సహజంగా ఎలా ప్రవర్తించాలో అలా మాత్రం ప్రవర్తించదు ఈ క్యారెక్టర్. కొన్ని చోట్ల అతడి డబ్బింగ్ కి.. నటనకు పొంతన కుదర్లేదు. విలన్ పాత్రధారి ఓవరాక్షన్ చేశాడు. ఉన్నంతలో అందర్లోకి సుదర్శన్ బెటర్. అతడి పాత్ర కూడా వేస్టే కానీ.. ఉన్నంతలో అక్కడక్కడా తనదైన శైలిలో డైలాగులు పలుకుతూ నవ్వించే ప్రయత్నం చేశాడు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా కూడా ‘అంతం’లో చెప్పుకోవడానికేమీ లేదు. కార్తీక్ రోడ్రిగ్జ్ ‘గులాబీ’లోని ఈ వేళలోన పాటను రీమేక్స్ చేసి ఒకటి.. వర్మ సినిమాల్లో పాటల్ని ఫాలో అయిపోతూ ఇంకోటి.. ఏవో రెండు పాటలు ట్రై చేశాడు. అవేమీ పెద్దగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. కెమెరా వర్క్ అంతా కూడా వర్మ సినిమాల్ని ఫాలో అయినట్లుగా కనిపిస్తుంది. దర్శకుడు జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్.. వర్మ ‘ఐస్ క్రీమ్’ చూసి స్ఫూర్తి పొంది ఈ సినిమా చేశాడేమో అనిపిస్తుంది. విషయం లేని కథను రెండు గంటలు సాగదీసి.. పరిమితమైన పాత్రలు.. పరిమితమైన లొకేషన్లలో తక్కువ ఖర్చుతో సినిమా పూర్తి చేసి.. కేవలం హీరోయిన్ అందాల్ని ఎరగా వేసి జనాల్ని థియేటరుకి రప్పించే ప్రయత్నం చేశాడతను. రాతలో.. తీతలో కళ్యాణ్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలేమీ లేవు.
చివరగా: ఆది నుంచి అంతం వరకు సహనానికే పరీక్షే
రేటింగ్: 1/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre