Begin typing your search above and press return to search.
'గతం మరిచినా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతా..' అంటున్న ప్రముఖ నటి
By: Tupaki Desk | 22 July 2020 2:30 AM GMTజీవితంలో కొన్ని అనుకొని సంఘటనలు జీవితం పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ సంఘటనల వలన ఒక్కోసారి జీవితం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. అలాంటి వాటిలో ఆక్సిడెంట్ ఒకటి. నిజానికి ఆక్సిడెంట్స్ అనేవి ప్రాణాలు తీస్తాయి.. లేదా జీవితాన్ని దుర్భరం చేస్తాయి. కొన్ని సార్లు చావు వరకు తీసుకెళ్లి బతికిస్తాయి. అదే ఆక్సిడెంట్ అనేది సామాన్యుల జీవితంలో కోలుకోలేని కష్టంగా మిగులుతుంది. అదే సెలబ్రిటీల జీవితంలో ఓ జ్ఞాపకంగా మిగులుతుంది. 1999లో ఓ ప్రముఖ నటి పరిస్థితి అలాగే మారింది. లేదు ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఆమె జీవితంపై గుర్తు తెచ్చుకోలేని జ్ఞాపకంగా మిగిలింది. ఆమెనే అను అగర్వాల్. ఈ యాక్ట్రెస్ అందరికి తెలియకపోవచ్చు.. ముఖ్యంగా ఈతరం వారికి అసలు తెలియకపోవచ్చు. ఎందుకంటే 90వ దశకంలోనే ఆమె ప్రమాదానికి గురైంది. కానీ మణిరత్నం రూపొందించిన దొంగ దొంగ సినిమాలో నటిచింది. అలాగే పలు బాలీవుడ్ సినిమాలలో గుర్తుండిపోయే సినిమాలు చేసింది.
1990లో ఆషీకీ అనే బాలీవుడ్ సినిమాతో హీరోయినుగా పరిచయం అయింది. ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్. ఇక 1999లో కెరీర్ పీక్స్ లో ఉండగా ప్రమాదానికి గురై అను అగర్వాల్ తన గతాన్ని మర్చిపోయింది. అంటే 29రోజులు కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కోలుకొని బెంగళూరులో నివాసం ఉంటోంది. కోమా నుండి బయటికి వచ్చాక ఆమె యోగ చేయడం.. పవర్ లిఫ్టింగ్ వంటివి ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది. అను అగర్వాల్ ఎన్నో పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లలో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ బ్యూటీ కెమెరా ముందుకు రానుందట. మళ్లీ యాక్టింగులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనుందట. అను అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందించనున్న వెబ్ సిరీస్ తో ఆమె రీఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో ఆమె ప్రస్తుత పాత్రను ఆమె పోషిస్తుండగా.. యంగ్ అనుగా ఓ యంగ్ హీరోయిన్ నటించనుందట. చూడాలి మరి అసలు ఆమె జీవితంలో ఏం జరిగింది.. అనే విషయాలు ఈ వెబ్ సిరీస్ లో చూపిస్తారేమో..!