Begin typing your search above and press return to search.
రియల్ గానూ నా క్యారెక్టర్ అదే.. అను ఓపెన్ కామెంట్స్!
By: Tupaki Desk | 4 Nov 2022 12:30 AM GMTఅను ఇమ్మాన్యుయేల్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ అందాల సోయగం న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన 'మజ్ను' సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే అందం, అభినయం ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన అను.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలతో ఆడి పాడింది.
అయితే ఎంత పెద్ద స్టార్ హీరోలతో నటించిన అను ఇమ్మాన్యుయేల్ ను సక్సెస్ మాత్రం వరించలేదు. ఆమె నుంచి చివరిగా వచ్చిన 'మహాసముద్రం' సైతం ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇక అను ఇప్పుడు తన ఆశలన్నీ 'ఊర్వశివో రాక్షసివో' పైనే పెట్టుకుంది. అల్లు శిరీష్ హీరోగా రాకేష్ శశి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ ఇది.
నవంబర్ 4న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా అను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను పంచుకుంది. అలాగే పలు వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకుంది. ఇందులో సింధూ అనే సాఫ్ట్‌వేర్ అమ్మాయిగా అను నటించింది.
కెరీర్ లో మంచి స్థాయికి ఎదగాలన్న తపన ఉన్న అమ్మాయి సింధు. ఆమెకు ప్రేమ కావాలి.. కానీ ప్రేమే జీవితం అనుకోదు. అలాంటి అమ్మాయికి శ్రీకుమార్ అనే సింపుల్ కుర్రాడు పరిచయం అవుతాడు. ఆ సింపుల్ కుర్రాడికి, కెరియర్ ఓరియెంటెడ్ అమ్మాయికి మధ్య ప్రేమ కథ ఎలా నడిచింది..? అన్నది ఊర్వశివో రాక్షసివో సినిమా కథ.
అయితే సింధు పాత్ర ఎలా ఉంటుందో రియల్ లైఫ్ లోనూ తన క్యారెక్టర్ అలానే ఉంటుందని అను ఓపెన్ అయింది. రియల్ లైఫ్ లో తాను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని, కెరీర్ లో తాను వేసే ప్రతి అడుగు వెనక మంచి స్థాయికి వెళ్లాలనే ఆలోచన ఉంటుందని అను తెలిపింది. ఈ సినిమాలో సింధు పాత్ర కూడా అలానే ఉంటుందని, అయితే ట్రైలర్ లో చూపించిన ఫిజికల్ రిలేషన్‌షిప్ మాత్రం నిజజీవితంలో తనకు కనెక్ట్ కాదని అను వెల్లడించింది.
ఇక ఏదైనా సినిమాకు సైన్ చేయాలంటే హీరో ఎవరు? అన్నది అడగనని.. కేవలం కథ, బ్యానర్ గురించే ఆలోచిస్తానని తెలిపింది. అలాగే వచ్చిన పాత్ర తనకు సూట్ అవుతుందన్న భావన కలిగితేనే సినిమాకు సైన్ చేస్తానని.. లేదంటే నిర్మొహమాటంగా నో చెప్పేస్తానని పేర్కొంది. కాగా, అను ఇమ్మాన్యుయేల్ ఇతర ప్రాజెక్టులు విషయానికి వస్తే.. మాస్ మహారాజ్ రవితేజకు జోడిగా ఈమె 'రావణాసుర' అనే సినిమాలో నటిస్తోంది. అలాగే ఓటీటీలో ఓ వెబ్ సిరీస్‌కు సైన్ చేసిందని కూడా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.